Karimnagar: పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్!
Karimnagar: కరీంనగర్ ప్రజావాణికి 138 దరఖాస్తులు రాగా, పెండింగ్ అర్జీలపై కలెక్టర్ చిత్రా మిశ్రా సమీక్ష నిర్వహించి తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.
Karimnagar: పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్!
కరీంనగర్: ప్రజావాణి కార్యక్రమానికి 138 దరఖాస్తులు వచ్చాయి. పెండింగ్ దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా శాఖల వారీగా సమీక్షించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడిఓసి) సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 138 దరఖాస్తులు ప్రజల నుండి అందగా వాటి పరిష్కారానికి వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు.
కార్యక్రమానంతరం జిల్లా కలెక్టర్ వివిధ శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులపై సమీక్షించారు. ముఖ్యంగా పోలీస్, పంచాయతీ, ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్, ఎలక్ట్రిసిటీ, కార్పొరేషన్ శాఖల్లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డిఆర్ఓ స్వామి, ఆర్డీవో షర్మిల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




