Karimnagar: ఇందిరమ్మ జీవిత బీమా క్యాంపులపై సమీక్ష

Karimnagar: కరీంనగర్‌లో 32 ప్రాంతాల్లో శుక్రవారం నుంచి ఇందిరమ్మ జీవిత బీమా క్యాంపులు నిర్వహించనున్నట్లు, డేటాలో పొరపాట్లు లేకుండా చూడాలని కమీషనర్ తెలిపారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 19 Nov 2026 9:55 PM IST
Karimnagar
X

Karimnagar: ఇందిరమ్మ జీవిత బీమా క్యాంపులపై సమీక్ష

కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన "‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’" (రూ. 5 లక్షల బీమా) పథకాన్ని నగరపాలక సంస్థ పరిధిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో రెవెన్యూ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుధ్య విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది తో ప్రత్యేక సమీక్షా సమావేశం జరిగింది.

మొత్తం 66 డీవిజన్లలో 32 లోకేషన్ ప్రాంతాల్లో ప్రత్యేక శిభిరాలు, కావల్సిన వసతి సౌకర్యాలతో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, ఆన్ లైన్ నమోదు, పారదర్శకత, శిబిరాల ప్రారంభోత్సవం, తదితర అంశాలపై చర్చించి... ప్రభుత్వ ఆదేశానుసారం గెజిటెడ్ అధికారులు, ఆర్వోలు, ఆర్ఐలు, ఇన్ స్పెక్టర్లు, వర్క్ ఇన్ స్పెక్టర్లు,జవానులు, వార్డు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రేపటి నుండి దాదాపు 30 రోజుల పాటు దరిగే శిబిరాల నిర్వహణ, అధికారులు, సిబ్బంది విధుల నిర్వహాణ, దరఖాస్తులను పూరించి... ఆన్ లైన్ నమోదు ప్రక్రియ, భీమా దరఖాస్తు దారుల నుండి సేకరించాల్సిన డేటా వివరాలు తదితర విషయాల పై పలు సలహాలు, సూచనలు చేస్తూ... ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన "ఇందిరమ్మ జీవిత భీమా 5 లక్షల పథకం ను నగరపాలక సంస్థ లో సమర్థవంతంగా అమలు చేస్తూ... అర్హులకు 100 శాతం లబ్ధిచేకూర్చేలా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, నియమ నిబంధనలను అనుసరించి.. భీమాను సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు.

నగరపాలక సంస్థ పరిదిలో 66 డివిజన్లకు మొత్తం 32 లోకేషన్లలో ప్రత్యేక శిభిరాలను ఏర్పాటు చేసి... కావల్సిన వసతులు, సౌకర్యాలు పూర్తి చేశామన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకే లోకేషన్ల ప్రకారం శిబిరాలను ప్రారంభం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులు సిబ్బంది ఆదేశించినట్లు తెలిపారు. 3 నుండి 4 డివిజన్ల కు ఒక లొకేషన్ లో శిభిరాలను ఏర్పాటు చేశామని... డివిజన్ ప్రకారం అధికారులు, సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ప్రతి లొకేషన్ లో ఉదయం 8 గంటలకే శిబిరాన్ని ప్రారంభం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

క్యాంపుల వద్ద వచ్చే లబ్దిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగు నీరు,టెంట్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు, దరఖాస్తు ఫారాలతో అన్ని సిద్దం చేశామని స్పష్టం చేశారు. 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు గల కుటుంబ యజమానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత 5 లక్షల భీమా దరఖాస్తు చేస్కోవాలని పిలుపు నిచ్చారు. లోకేషన్లలోనే వార్డు అధికారులు, ఇన్ స్పెక్టర్లు, వర్క్ ఇన్ సెక్టర్లు, జవానులు భీమా దరఖాస్తులలో డేటాను సేకరించి... ఆన్ లైన్ ప్రక్రియ ఎప్పటికప్పుడు చేయాలన్నారు.

ప్రతి దరఖాస్తు ఐడీ నెంబర్ ను రిజిస్టర్ లో రికార్డు చేయాలని ఆదేశించారు. భీమా చేస్కునే లబ్ధిదారుడి వద్ద ప్రధానంగా ఆధార్ ఖార్డు, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్ తో కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి దరఖాస్తులను పూరించాలన్నారు. శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్క యజమాని అయిన లబ్ధిదారుడి నుండి దరఖాస్తును తప్పక నమోదు చేయించాలని సూచించారు. వచ్చిన దరఖాస్తు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ఆప్ లో నమోదు చేయాలని సూచించారు.

శిబిరాలకు వచ్చే అర్హులైన లబ్ధిదారుల బీమా దరఖాస్తులను సక్రమంగా పూరించడంతో పాటు, ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. బీమా నమోదు కోసం సేకరించే డేటా ఎంట్రీలో ఎటువంటి పొరపాట్లు, లోటుపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని కమీషనర్ అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఈ పథకం ప్రయోజనం అందేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమీషనర్ దిశానిర్దేశం చేశారు.

ప్రణాళిక బద్దంగా క్లస్టర్ వారిగా శిభిరాలను సమర్థవంతంగా నిర్వహించాలని... స్థానిక కార్పోరేటర్లు, ప్రజా ప్రతినిధుల ఆహ్వనించి... సమన్వయంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. దరఖాస్తు దారుడు శిబిరాల వద్దకు వచ్చి తమ డేటాను దరఖాస్తుల ద్వారా ఇవ్వాలని కోరారు. దరఖాస్తుల వివరాల నమోదు, సేకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు, తప్పులు దొర్లకుండ జాగ్రత్తలు వహించాలని ఆదేశించారు. ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేసి విజయవంతం చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

​ఈ సమావేశంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్లు ఖాధర్ మొహియుద్దీన్, వేణుమాధవ్, అసిస్టెంట్ కమీషనర్ రాజమనోహర్, ఈఈ లచ్చిరెడ్డి, డీసీపీ, ఏసీపిలు, డీఈలు,ఆర్వోలు, ఆర్ఐ లు, ఎస్ఐలు, వర్క్ ఇన్ స్పెక్టర్లు, జవానులు, తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR