Jammikunta: తనుగుల భూవివాదం హత్య కేసును ఛేదించిన పోలీసులు
Jammikunta: జమ్మికుంట తనుగుల భూవివాదం హత్య కేసులో ఏడుగురు నిందితుల అరెస్ట్. తల్లి, కుటుంబ సభ్యులతో గొడవపడి హత్యకు గురైన రాజబాబు ఉదంతం.
Jammikunta: తనుగుల భూవివాదం హత్య కేసును ఛేదించిన పోలీసులు
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని తనుగుల గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో బొజ్జపల్లి రాజబాబు అనే వ్యక్తి హత్యకు గురైన సంఘటనకు సంబంధించి జమ్మికుంట పోలీసులు కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో వెల్లడైన
మృతుడు బొజ్జపల్లి రాజబాబు తన తల్లి A-3.బొజ్జపల్లి లచ్చమ్మకు చెందిన భూమి విషయంలో కుటుంబ సభ్యులతో తరచూ వివాదాలకు దిగేవాడు. సదరు భూమిని విక్రయించాలని రాజబాబు కోరగా, కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించకపోవడంతో వారితో తరచూ గొడవపడుతూ, దూషిస్తూ అసభ్యంగా ప్రవర్తించేవాడని విచారణలో తెలిసింది.
ఈ నేపథ్యంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి, సదరు భూమిని మూడు వాటాలుగా విభజించి, ఒక వాటాను తల్లి లచ్చమ్మకు, ఒక వాటాను రాజబాబుకు, మరో వాటాను రాజబాబు తమ్ముడు కుమార్ కుమార్తె సిరిచందనకు ఇవ్వాలని సూచించారు. అయితే, రాజబాబు అందుకు అంగీకరించకుండా, భూమి మొత్తం తనకే చెందాలని పట్టుబట్టాడు. దీంతో గత 8 నెలలుగా లచ్చమ్మ జమ్మికుంటలో అద్దెకు ఉంటోంది.
గత పది రోజుల క్రితం తన బిడ్డ ఇంటికి A-3 కవిత వద్ద, లచ్చమ్మ తనుగుల గ్రామంలో వెళ్లింది నివసిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజబాబు కుటుంబ సభ్యులపై కక్ష పెంచుకున్నాడు.
తేదీ:10-09-2026న మధ్యాహ్నం సుమారు 1.00 గంటల సమయంలో, రాజబాబు అధికంగా మద్యం సేవించి తనుగుల గ్రామంలో నివాసం ఉంటున్న తన బావ అయిన A-1 జూపాక శంకర్ ఇంటికి వచ్చాడు. అక్కడ ఉన్న తన తల్లి A-3 లచ్చమ్మ, తన అక్క A-2 కవితతో గొడవకు దిగాడు. కుటుంబ సభ్యులు అతడిని వారించేందుకు ప్రయత్నించినప్పటికీ, రాజబాబు తన తల్లి లచ్చమ్మ వెంట్రుకలు పట్టుకుని లాగడంతో అక్కడ తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ సమయంలో అప్పటికే మద్యం సేవించి ఉన్న A-7. జూపాక శంకర్, A-4. చేతి వెంకటేష్, A-6.మారపెల్లి రాజయ్య, A-5 జూపాక సతీష్ తదితరులు కలిసి రాజబాబును పట్టుకుని చేతులతో కొట్టి మంచంపై పడవేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం అతని చేతులు, కాళ్లను మంచానికి కట్టి ఉంచినట్లు తెలిసింది. ఆ తర్వాత జూపాక శంకర్ చున్నీతో రాజబాబు మెడకు బిగించి పట్టుకోవడంతో అతడు మృతి చెందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
రాజబాబు మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం, నిందితులు ఈ సంఘటనను దాచిపెట్టే ఉద్దేశంతో మృతదేహాన్ని దుప్పటిలో చుట్టారు. అదే రాత్రి A-1. జూపాక శంకర్, A-6 మారపెల్లి రాజయ్య A-7. జూపాక శంకర్ s/o లేట్ రామయ్య కలిసి మృతదేహాన్ని సైకిల్‌పై తరలించి, తనుగుల గ్రామ శివారులోని శంకర్‌కు చెందిన పొలానికి తీసుకెళ్లారు. అక్కడ పార, గడ్డపారలతో గుంత తవ్వి మృతదేహాన్ని అందులో పూడ్చిపెట్టి, పైభాగంలో మట్టి మరియు తుమ్మ పొరకతో కప్పి, ఎవరూ గుర్తించకుండా చేసినట్లు విచారణలో వెల్లడైంది.పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులు:
మృతదేహాన్ని పూడ్చేందుకు ఉపయోగించిన పార, గడ్డపార, మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన సైకిల్, రాజబాబు మెడ బిగించేందుకు ఉపయోగించిన చున్నీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.జమ్మికుంట పోలీసుల విజ్ఞప్తి భూ వివాదాలు, కుటుంబ సమస్యలు లేదా ఇతర వ్యక్తిగత వివాదాల విషయంలో ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా, సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించి చట్టపరమైన మార్గంలో పరిష్కారం పొందాలని జమ్మికుంట పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.




