Karimnagar: కరీంనగర్‌లో పీడీఎస్ బియ్యం పట్టివేత రైస్ మిల్లుపై దాడి!

Karimnagar: కరీంనగర్ పద్మనగర్‌లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించి సన్నబియ్యంగా మారుస్తున్న రైస్ మిల్లుపై పోలీసులు దాడి చేసి 306.88 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 29 Sept 2026 7:31 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో పీడీఎస్ బియ్యం పట్టివేత రైస్ మిల్లుపై దాడి!

Karimnagar: కరీంనగర్-II టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో అక్రమంగా PDS బియ్యం కొనుగోలు చేసి, పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్చి విక్రయిస్తున్న రైస్ మిల్లుపై దాడి – 306.88 క్వింటాళ్ల PDS బియ్యం మరియు ఒక ట్రాలీ ఆటో స్వాధీనం. ఈరోజు అనగా తేదీ 29-09-2025 న ఉదయం సుమారు 11:30 గంటలకు, కరీంనగర్ పట్టణంలోని పద్మనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో గల హనుమాన్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో PDS బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి, పాలిష్ చేసి, వివిధ బ్రాండ్ల పేర్లతో సన్న బియ్యంగా మార్చి ప్రజలకు విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు పోలీసులు తనిఖీ నిర్వహించారు.

ఈ సందర్భంగా రైస్ మిల్ యజమాని తొడుపునూరి కరుణాకర్, తండ్రి జగన్నాథ్, వయస్సు 50 సంవత్సరాలు, కులం వైశ్య, నివాసం అశోక్‌నగర్, కరీంనగర్ తన రైస్ మిల్లులో పనిచేసే గుమాస్తా కొమ్మల్ల తిరుపతయ్య, అకౌంటెంట్ బోనాల సుమశ్రీ, సప్లయర్ కట్ట మురళిధర్ మరియు డ్రైవర్ మల్క తిరుపతి ల సహాయంతో BPL/PDS లబ్ధిదారుల నుండి ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించబడింది.

అనంతరం ఆ బియ్యాన్ని రైస్ మిల్లులో పాలిష్ చేసి, BPT, HMT, No.1 Kurnool, Tamato Gold, JSR, Kisan, Raja Gold, Double House మరియు Annapurna తదితర పేర్లతో ఉన్న సంచుల్లో ప్యాకింగ్ చేసి, సన్న బియ్యంగా ప్రజలకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఇటీవల సుమారు 350 క్వింటాళ్ల PDS బియ్యాన్ని వివిధ మార్గాల ద్వారా సేకరించి, పాలిష్ చేసి, కొంత బియ్యాన్ని సంచుల్లో ప్యాకింగ్ చేసి రవాణా చేయడానికి సిద్ధంగా ఉంచినట్లు గుర్తించారు. పోలీసులు పంచుల సమక్షంలో నిర్వహించిన తనిఖీలో, రైస్ మిల్లులో మరియు రైస్ మిల్ ముందు ఉన్న ట్రాలీ ఆటోలో కలిపి సుమారు 306.88 క్వింటాళ్ల PDS బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా Ape ట్రాలీ ఆటో నం. TG02-HTR-6674ను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అక్రమంగా PDS బియ్యాన్ని కొనుగోలు చేసి, పాలిష్ చేసి, ప్రజలకు ఇతర బ్రాండ్ల పేర్లతో విక్రయిస్తున్న వ్యవహారంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది పోలీసులు తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN