Karimnagar: కరీంనగర్‌లో విస్తృత నాకాబందీ.. వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు!

Karimnagar: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీసులు విస్తృతంగా నాకాబందీ మరియు వాహన తనిఖీలు నిర్వహించారు.

Velpugonda Ravikumar, Karimnagar
Published on: 15 Nov 2026 11:31 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో విస్తృత నాకాబందీ.. వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు!

Karimnagar: శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు విస్తృతంగా నాకాబందీ, వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాల్లో వాహనాల పత్రాలు, నంబర్ ప్లేట్లు తనిఖీ చేయడంతో పాటు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ఐపీఎస్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నాకాబందీ తనిఖీలను పరిశీలించారు. తనిఖీల సందర్భంగా పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి నిరంతర తనిఖీలు చేపట్టాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సీపీ ఆదేశించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీపీ తెలిపారు. ఈ తనిఖీల్లో ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Velpugonda Ravikumar, Karimnagar

Velpugonda Ravikumar, Karimnagar