Jammikunta: 24వ విడత పిఎం కిసాన్ నిధుల విడుదల ప్రసారం
Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట కేవీకేలో 24వ విడత పిఎం కిసాన్ నిధుల విడుదల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని నిర్వహించారు. DAO ఛత్రు నాయక్ పాల్గొన్నారు.
Jammikunta: 24వ విడత పిఎం కిసాన్ నిధుల విడుదల ప్రసారం
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఖుషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా *24 వ విడత ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి విడుదలను పురస్కరించుకొని పియం కిసాన్ ఉత్సవ్ దివాస్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛత్రు నాయక్ జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ అన్నదాతకు గౌరవం ఇవ్వడం
అంటే దేశ భవిష్యత్తుకు గౌరవం ఇవ్వడమే అని రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే కార్యక్రమాలు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ సుసంపన్నతను తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అందుకే భారత కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం పలు కీలక పథకాలను అమలు చేస్తోందని ఆ పథకాలలో భాగంగానే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ని 2019 ఫిబ్రవరిలో ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ నుంచి మోదీ ప్రారంభించారని,
కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఈ పథకం ద్వారా మూడు విడతల్లో 2,000 చొప్పున సంవత్సరానికి రూ. 6,000 సాయంగా అందిస్తూ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందని తెలిపారు. ఇప్పటివరకు 23 విడతల్లో కలిపి రూ.4.47 లక్షల కోట్లకు పైగా రైతులకు అందించారు.దీనిలో భాగంగా గుజరాత్ లోని బనస్కాంత వేదికగా 24 విడతలో దాదాపు 9.34 కోట్ల మంది రైతులకు 18860 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు.
కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డా ఎన్ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ రైతు సంక్షేమ అంటే కేవలం ఉత్పత్తిని పెంచడం మాత్రమే కాదని విత్తనాలు, ఎరువులు వ్యవసాయానికి సంబంధించిన చిన్న-పెద్ద అవసరాల కోసం కొంత ఆర్థిక సహాయం అందచేయడం కూడా అని దీనిలో భాగమే pm కిసాన్ సమ్మాన్ నిధి అని తెలిపారు.
రైతులే దేశ ఆహార భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదనీ తెలుపుతూ ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల వాతావరణ మార్పులు జరిగి వర్షాలు సరిగా లేక ప్రపంచ వ్యాప్తంగా కరువు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు తమ వంతు బాధ్యతగా నీటిని పొదుపు చేసే విధంగా వారి యొక్క నీటి వసతులను బట్టి వరికి ప్రత్యామ్నాయం గా ఆరు తడి పంటలను సాగు చేయాలని దీని కొరకు రైతులకే కాకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేత్ బచావో అభియాన్ పేరుతో 22 అక్టోబర్ నుండి 30 నవంబర్ వరకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు.
రైతులు కేవలం పంటల పైననే కాకుండా పశువులు - పశుగ్రాసా లు కి రాబోయే కాలంలో డిమాండ్ అధికంగా ఉంటుందని కావున రైతులు వాటి మీద కూడా దృష్టి సాధించాలని మోడీ తెలిపారని రైతులకు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు, కేవికే శాస్త్రవేత్తలు& సిబ్బంది , రైతులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.




