Karimnagar: కరీంనగర్ జిల్లాలో రోడ్లపై వరి ధాన్యం ఆరబోతతో మళ్లీ ప్రమాదాల భయం!

Karimnagar: కరీంనగర్ జిల్లాలో రోడ్లపైనే వరి ధాన్యం ఆరబోస్తుండటంతో ప్రమాదాల భయం. రంగమ్మపల్లె వద్ద కారు-బైక్ ఢీకొని ప్రమాదం. స్పందించాలని వాహనదారుల విజ్ఞప్తి.

GANESH, JAMMIKUNTA
Published on: 1 Nov 2026 12:32 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ జిల్లాలో రోడ్లపై వరి ధాన్యం ఆరబోతతో మళ్లీ ప్రమాదాల భయం!

Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లంతకుంట వీణవంక మండలాల్లో రైతులకు మళ్లీ ధాన్యం కష్టాలు మొదలయ్యాయి. మరింతో మంది మృతి చెందుతారో ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడతాయో మృతి చెందిన బంధువుల ఆవేదన.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వీణవంక మండలం ఇల్లంతకుంట మండలంలో రైతులు పంట చేతికొచ్చి వరి కోతలు ప్రారంభమైన వేళ. తమ కష్టాన్ని ధాన్యంగా మార్చుకున్న రైతులకు ఆ ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేసుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో వరి కోతలు పూర్తయిన తర్వాత ధాన్యాన్ని పొలాల దగ్గర్నే కల్లాలు చేసుకుని ఆరబెట్టేలి రైతులు ఇంట్లో పెట్టుకోవాలి లేక, కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ మార్కెట్ యార్డ్ పోసుకోవాలి రైతులు రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబోసి, రోజుల తరబడి పరిస్థితి వాహనదారులకు కుటుంబాలు తీవ్రఇబ్బందులు.

ఎదుర్కొంటున్నాయి.ఇప్పుడు మళ్లీ వరి కోతలు ప్రారంభం కావడంతో అదే పరిస్థితి పునరావృతం మవుతుంది భయంతో వాహనదారులు రైతులు వన్ సైడు వల్ల వచ్చి పోయేటి బైకులు వాహనాలు రోజు 24 గంటలు హైవే మీద తిరుగుతాయని ఇంట్లో నుండి బయటికి వెళ్లిన వ్యక్తి ఎప్పుడు తిరిగి వస్తాడో భయం భయంగా ఉంటుందని అప్పట్లో యాక్సిడెంట్ అయి 15 మంది మృతి చెందారు మృతి చెందిన కుటుంబాలు వేడుకుంటున్నారు ఇకనైనా రైతులు రోడ్డుపై వరి ధాన్యాలు పోయావద్దని వినడం లేదు రైతులు.

ఆదివారం ఉదయం కరీంనగర్ హైవే రంగమ్మపల్లె నుండి జగ్గయ్యపల్లి ఉదయం రోడ్డుపై పోసిన వారి ధాన్యం వన్ సైడ్ చేయడం వల్ల కారు బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలు ఆసుపత్రిలో చికిత్స పొందినారు ఉదయం పూటనే ఇలా జరుగుతే ఇంకా రాత్రి ఎంత జరుగుతదో అని భయాందోళన గురి అవుతున్నారు వాహనదారులు ఇప్పటికైనా అధికారులు స్పందించాలి! వరి ధాన్యాలు పోసిన రైతులపై పోలీసులు కేసులు పెట్టాలని ఇప్పటివరకు ఒక్క కేసు కూడా రైతుల మీద పెట్టలేదని అసలు పోలీస్ శాఖ అసలు పట్టించుకోవడమే లేదని మృతి చెందిన బంధువులు వేడుకుంటున్నారు ఇలాంటి ప్రాణాలు నష్టం జరగ ముందుకే ఇప్పటికైనా పోలీసు శాఖ పట్టించుకోవాలి అని వాహనాదారులు రోడ్డుమీద ఇప్పుడే వరి ధాన్యాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA