Thimmapur: నుస్తులాపూర్‌లో పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ!
Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ పంచాయతీలో సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేసిన సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాస్ రావు.
Thimmapur: నుస్తులాపూర్‌లో పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ!
Thimmapur: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలను అందజేశారు.
పండుగల వేళ గ్రామ పంచాయతీ సిబ్బందిని ఆప్యాయంగా గుర్తించి, వారికి నూతన వస్త్రాలను అందించడం ద్వారా పండుగ సంతోషాలను పంచుకున్నారు. గ్రామ అభివృద్ధిలో, ప్రజలకు సేవలు అందించడంలో గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తున్న కృషిని ఈ సందర్భంగా గుర్తించారు. నుస్తులాపూర్ గ్రామ ప్రజలందరికీ బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు గ్రామ సర్పంచ్ తుమ్మనపల్లి సంధ్య శ్రీనివాస్ రావు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోగూరి అంజలి నరసింహారెడ్డి , వార్డు సభ్యులు నూనె సురేష్ , వంగల శ్రీనివాస్ రెడ్డి, దాడి మొండయ్య , రొడ్డ హరిత–అనిల్ , ఆవుల నర్సయ్య , సిరిగినేని కొండల్ రావు , తమ్మనవేణి స్వరూప కొండయ్య , అలువాల రాజేంద్ర ప్రసాద్ , నగ్మా నౌషీన్ నిసార్ , గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.




