Karimnagar: కరీంనగర్ రెడ్ క్రాస్ నూతన కమిటీ సభ్యుల బండి సంజయ్ భేటీ!
Karimnagar: కరీంనగర్ రెడ్ క్రాస్ నూతన కార్యవర్గ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసి శుభాకాంక్షలు అందుకున్న సన్మాన కార్యక్రమం.
Karimnagar: కరీంనగర్ రెడ్ క్రాస్ నూతన కమిటీ సభ్యుల బండి సంజయ్ భేటీ!
Karimnagar: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికల ద్వారా ఎంపికైంది. డిప్యూటీ కోఆపరేటివ్ ఆఫీసర్ సమక్షంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని సూచించారు.
మానవతా దృక్పథంతో, సేవాభావంతో ప్రజలకు అండగా నిలవాలని అలాగే నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచి, ప్రజాసేవలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
అనంతరం బండి సంజయ్ కుమార్ వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సంగెం లక్ష్మణరావు,వైస్ చైర్మన్ ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి,పెండ్యాల కేశవరెడ్డి, కుందారపు మహేశ్వర్ ,గోనె శ్రీనివాస్, మొగలోజు రాకేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు కోలా అన్నారెడ్డి,
పెద్ది విద్యాసాగర్, చిదుర సురేష్, పి. శ్రీహరి రెడ్డి, రాగి శ్రీనివాస్, సాయిని నరేందర్, హనుమాండ్ల రాజిరెడ్డి, కానపర్తి మనోహర్ రావు, ఎలుగందల మునీందర్ , ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సర్దార్ హర్మీంధర్ సింగ్, టీఎన్జీవోల సంఘం కరీంనగర్ టౌన్ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంత్ రావు పాల్గొన్నారు.




