Karimnagar: ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన మేయర్ కొలగాని!
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు.
Karimnagar: ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేసిన మేయర్ కొలగాని!
కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ కార్యక్రమం జరిగింది. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆయన చాంబర్‌లో మొదటి విడత కింద నగరంలోని వివిధ డివిజన్లకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు సంబంధిత డివిజన్ల కార్పోరేటర్లతో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. మొదటి విడుతలో భాగంగానే నగరపాలక సంస్థ పరిదిలో మరో 20 ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ లు జారీ అయ్యాయి. ప్రొసిడింగ్ ప్రత్రాలు పొందిన లబ్ధిదారులు మేయర్, కార్పోరేటర్లకు శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వాలు గృహా పథకాలను ప్రారంభం చేశాయని తెలిపారు. పక్కా గృహాల నిర్మాణం కోసం జారీ చేసిన ఈ ప్రొసీడింగ్ పత్రాల ద్వారా లబ్ధిదారులు త్వరగా ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించుకోవాలని వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గడ్డి ప్రదీప్, పర్వతం మల్లేషం, లబ్ధిదారులు పాల్గొన్నారు.




