Karimnagar: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కరపత్రం విడుదల చేసిన కార్పొరేటర్లు!
Karimnagar: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, కార్పొరేటర్లు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కరపత్రాన్ని విడుదల చేశారు.
Karimnagar: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కరపత్రం విడుదల చేసిన కార్పొరేటర్లు!
కరీంనగర్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన కరపత్రాన్ని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కలిసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ, దివంగత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ పేరు మీద ప్రతి కుటుంబానికి జీవిత బీమా భరోసా కల్పించే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఆపద సమయంలో ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి కుటుంబం ఈ పథకం గురించి తెలుసుకొని, అర్హతలు మరియు దరఖాస్తు విధానాన్ని పరిశీలించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రతి కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచే విధంగా జీవిత బీమా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వారాల నర్సింగ్, జగన్ రెడ్డి, పార్వతుల మల్లేశం, గంట శ్రీనివాస్, ఆకుల ఉదయ్, చారకొండ బుచ్చిరెడ్డి సరేల ప్రసాద్ ,పరిశెట్టి భూమయ్య ,విక్రమ్, సికందర్, అజయ్, ఆర్ జి పి ఎస్ మడుపు మోహన్, చైర్మన్ మార్పు మోహన్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహ్మద్ అలీ, పెంట శేఖర్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




