Karimnagar: కరీంనగర్‌ను అగ్రస్థానంలో నిలుపుతాం మేయర్ కొలగాని శ్రీనివాస్!

Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని మేయర్ కొలగాని శ్రీనివాస్ ధీమా. 21వ డివిజన్‌లో రూ. 20 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 14 Oct 2026 1:59 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌ను అగ్రస్థానంలో నిలుపుతాం మేయర్ కొలగాని శ్రీనివాస్!

Karimnagar: విలీన గ్రామాలు శివారు ప్రాంతాల డివిజన్ల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా బుధవారం 21 వ డివిజన్ లో పర్యటించారు. శ్రీరాంనగర్ కాలనీలో స్థానిక కార్పోరేటర్ వరాల నర్సింగంతో కలిసి రూ.20 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం పనులకు భూమీ పూజ చేశారు. అనంతరం డివిజన్ లో స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేపట్టిన పనులను వేగవంతంగా నాణ్యత తో పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్ కు ఆదేశించారు.

ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు తమ పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. కరీంనగర్ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారం తో పాలకవర్గం ఏర్పడిన వంద రోజుల్లో కరీంనగర్ ను అర్బన్ చాలేంజ్ ఫండ్ స్కింలో చేర్చి... 840 కోట్ల నిధులు తెచ్చామని... త్వరలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీస్కుంటున్నామని తెలిపారు.

పాలకవర్గం ఏర్పిడితే పని చేస్తామని ప్రజలకు ఇట్టిన మాట ప్రకారం గడిచిన 7 నెలల కాలం కోట్ల రూపాయల నిధులతో డివిజన్ల లో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. బండి సంజయ్ కుమార్ సహకారం తో 50 కోట్ల యూఐడీఎఫ్ నిధులతో డివిజన్ల లో పనులు చేపట్టామని... 21 వ డివిజన్ కు 70 లక్షలు కేటాయించి... అభివృద్ధి పనులు ప్రారంభం చేశామన్నారు. మరో 30 కోట్ల యూఐడీఎఫ్ నిధులు తెచ్చి మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. 21 వ డివిజన్ లో అత్యధికంగా దాదాపు 6 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. అంతే కాకుండా 15 ఆర్థిక సంఘం నుండి మంచి నాటి పైపులైన్ కోసం 50 లక్షలు కేటాయించామన్నారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో యూసిఎఫ్ స్కీంలో నగరాన్ని మరింత మెరుగ్గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. టవర్ సర్కిల్ ప్రాంతం మొత్తం రద్దీగా ఉంటుంది కాబట్టి ప్రజలకు పార్కింగ్ సమస్య ఇబ్బందిగా మారడాన్ని దృష్టిలో పెట్టుకొని 25 కోట్ల నిధులతో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ భవన నిర్మాణంకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజల పార్కింగ్ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. నగరంలోని ప్రధాన చౌరస్తాలలో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా మల్టీ స్కైవాక్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లోనే కరీంనగర్ నగరపాలక సంస్థ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి... మాడల్ సిటీగా మార్చుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ కర్రె అనిల్, ఇంజనీరింగ్ అధికారులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN