Karimnagar: కరీంనగర్ దుర్గామాత ఆలయాల్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పూజలు
Karimnagar: కరీంనగర్ నగునూర్, చైతన్యపురి దుర్గామాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం. చండీ హోమంలో బండి సంజయ్‌తో కలిసి పాల్గొన్న తీరు.
Karimnagar: కరీంనగర్ దుర్గామాత ఆలయాల్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పూజలు
కరీంనగర్: చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం నేడు నగరంలోని పలు దుర్గామాత ఆలయాలను సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందులో భాగంగా మొదట పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి నగునూర్ దుర్గామాత ఆలయంలో అన్నపూర్ణ దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినారు..
అనంతరం చైతన్యపురిలోని మహాశక్తి ఆలయంలో దుర్గామాత, సరస్వతి మాత, మహాలక్ష్మి మాత అమ్మవార్లను దర్శించుకోగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనం అందజేసినారు, ఆలయంలో నిర్వహిస్తున్న చండీ హోమం కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. దేవి నవరాత్రుల సందర్భంగా నేడు కరీంనగర్‌లోని మహాశక్తి అమ్మవారిని అలాగే నగునూర్ లో దుర్గామాత ఆలయంలో అన్నపూర్ణ దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళు అనుకున్న లక్ష్యాలు, కోరికలు నెరవేరాలని రేపు విజయదశమి సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరికీ, కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి కార్యంలో విజయం చేకూర్చాలని అమ్మవారిని మనస్పూర్తిగా కోరుకోవడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మేడిపల్లి సత్యం తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు సహకార సంఘాల చైర్మన్లు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, కోల రమేష్, కాంగ్రెస్ నాయకులు పులి ఆంజనేయులు గౌడ్, ముత్యం శంకర్, జవ్వాజి హరీష్, అన్నమనేని నరసింహారావు, వంశీ గౌడ్, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




