Karimnagar: కేంద్ర మంత్రి క్యాంప్ ఆఫీస్‌లో మేయర్ దంపతుల పెళ్లిరోజు
Karimnagar: కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ - స్వర్ణలత దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
Karimnagar: కేంద్ర మంత్రి క్యాంప్ ఆఫీస్‌లో మేయర్ దంపతుల పెళ్లిరోజు
కరీంనగర్: కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ - స్వర్ణలత దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం కరీంనగర్ నగరంలోని కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. మేయర్ దంపతులను శాలువాతో సత్కరించి, పూల మొక్కను బహుకరించి హృదయపూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్ - స్వర్ణలత దంపతులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు గౌరవ పూర్వకంగా శాలువా కప్పి, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. మరో వైపు డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, పలువురు కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మేయర్ దంపతులకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.




