Karimnagar: 28వ డివిజన్‌లో రూ.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామని మేయర్ శ్రీనివాస్ వెల్లడి 28వ డివిజన్‌లో రూ.50 లక్షల పనులకు శంకుస్థాపన
Karimnagar: 28వ డివిజన్‌లో రూ.50 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన!
Karimnagar: నగరపాలక సంస్థ లో విలీనం చెందిన గ్రామాల డివిజన్ల అభివృద్ధి పై తమ పాలకవర్గం ప్రత్యేక దృష్టి పెట్టిందని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా 28 వ డివిజన్ లో మేయర్ పర్యటించారు. విద్యారణ్యపురి కాలనీలో స్థానిక కార్పోరేటర్ నున్సావత్ భాస్కర్, కార్పోరేటర్ సాధినేణి లావన్య మునింధర్ తో కలిసి 50 లక్షల యూఐడీఎఫ్ నిధులతో డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభం చేశారు. విద్యారణ్యపురి కాలనీలో స్థానిక కార్పోరేటర్లతో కలిసి స్థానిక డ్రైనేజీ సమస్యను తనిఖీ చేసి పరిశీలించారు. చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులు, కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థ పరిదిలో అభివృద్ధి పనులను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నామన్నారు. ప్రజలు, కార్పోరేటర్లు మా దృష్ఠికి తెచ్చిన ప్రతి సమస్యను పరిగణలోకి తీస్కోని ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను చేపట్టి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. 28, 3 రెండు డివిజన్ల పరిదిలోని విద్యారణ్యపురి ప్రాంతం శివారు ప్రాంతం కాబట్టి... ప్రజలకు కావల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడం మా పాలకవర్గం భాధ్యత అన్నారు.
విద్యారణ్యపురి అభివృద్ధి కోసం గత కౌన్సిల్ సమావేశంలో సాధారణ నిధుల నుండి దాదాపు 1 కోటి రూ. కేటాయించామని తెలిపారు. అంతే కాకుండా ఇటీవలే 25 లక్షల నిధుల కేటాయించి సీసీ రోడ్డు, డ్రైనేజీ అభివృద్ధి పనులను పూర్తి చేసి... స్థానిక ప్రజలకు సౌకర్యం కల్పించామని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో కరీంనగర్ నగరపాలక సంస్థలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
శివారు ప్రాంతాల డివిజన్ల కు తమ పాలకవర్గం అధిక సంఖ్యలో నిధులు కేటాయించి అభివృద్ధి లో ప్రాంతాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని స్పష్టం చేశారు. తమ పాలకవర్గం ఏర్పడితే డంపు యార్డు సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చాం కాబట్టి... పూర్తి స్థాయిలో డంపింగ్ యార్డును తొలగింపు పై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. యూసిఎఫ్ పథకం లో నగర వ్యాప్తంగా త్వరలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. డంపు యార్డు ప్రక్షాలన కోసం మరో 80 కోట్ల ప్రతిపాదనలు పెట్టి... టెండర్ ప్రక్రియ చేస్తున్నట్లు తెలిపారు.
యూసిఎఫ్ స్కీంలో కూడ చెత్త ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా డంపింగ్ యార్డు ను మొత్తం తొలగించేలా మా పాలకవర్గం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆడబిడ్డల సంస్కృతి, సాంప్రదాయ పండగ బతుకమ్మ కు నగరపాలక సంస్థ ఆద్వర్యంలో గతం కంటే ఘనంగా ఏర్పాట్లు చేయడం జరుతుందన్నారు. కావల్సిన ఏర్పాట్లు చేసేందుకు రూ. 2.80 కోట్లు నిధులు కేటాయించి టెండర్లు ప్రక్రియ పూర్తి చేశామన్నారు. సద్దుల బతుకమ్మ పండగకు మూడు రోజుల ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యంగా ఉండేలా వసతులు కల్పిస్తామని తెలిపారు.
అంతే కాకుండా దసర ఉత్సవాలకు కావల్సిన ఏర్పాట్లు కూడ ఘనంగా చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిధులు, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సహాకారం రాష్ట్ర నిధులు తెచ్చి నగరాన్ని సుంధర నగరంగా మార్చేందుకు తమ పాలకవర్గం పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డీఈ శ్రీనివాస్, ఏఈ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




