Karimnagar: విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు..మేయర్ కొలగాని శ్రీనివాస్!
Karimnagar: కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు.
Karimnagar: విలీన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు..మేయర్ కొలగాని శ్రీనివాస్!
Karimnagar: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎనిమిదవ డివిజన్ అలుగునూర్లో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ కాల్వ మల్లేశంతో కలిసి నగర మేయర్ ప్రారంభోత్సవాలు చేశారు. అలుగునూర్లో వారసంత ను ప్రారంభించి, బోర్ కి భూమి పూజ చేశారు. తమిళ కాలనీలో ఆర్టీసీ రిక్వెస్ట్ బస్ స్టాప్ లని, వారసంతను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విలీన గ్రామాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అలుగునూర్ అభివృద్ధి కోసం కోటి రూపాయలను కేటాయించినట్లు, సీసీ రోడ్లు డ్రైనేజీలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాలువ మల్లేశం, మాజీ సర్పంచ్, కేడీసీసీబీ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామి రెడ్డి, నాయకులు బొంతల కల్యాణ్ చంద్ర, సల్ల మహేందర్,చింతం శ్రీనివాస్,గట్టెపల్లి దీపక్,యాస్వాడ శ్రీకాంత్, ఎర్రం అనంత రెడ్డి, సర్వేశ్, దాసం కమలాకర్,యూసుఫ్,సిరిసిల్ల బాలయ్య,నాయకులు పాల్గొన్నారు.




