Karimnagar: శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మేయర్ కొలగాని పూజలు
Karimnagar: కరీంనగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మేయర్ కొలగాని ప్రత్యేక పూజలు. ఆలయ వద్ద డ్రైనేజీ సమస్య తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం.
Karimnagar: శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మేయర్ కొలగాని పూజలు
కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధిలో భాగంగా నగర మేయర్ కొలుగని శ్రీనివాస్ శనివారం మార్కెట్ సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. ఆలయ పరిసరాల్లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను ఆయన స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు.
అనంతరం మేయర్ శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మరియు సిబ్బంది మేయర్‌ను శాలువా, కండువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన నీరు రోడ్డుపైకి రాకుండా నేరుగా డ్రైనేజీలోకి ప్రవహించేలా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరుచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు నగరపాలక సంస్థ అధికారులు, టెంపుల్ ఈవో, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




