Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా జిల్లా సబ్-జూనియర్ జూడో పోటీలు ప్రారంభం!
Karimnagar: కరీంనగర్ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో కేలో ఇండియా బాలబాలికల జిల్లా సబ్-జూనియర్ జూడో పోటీలను నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా జిల్లా సబ్-జూనియర్ జూడో పోటీలు ప్రారంభం!
కరీంనగర్: క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి జిల్లా పేరును నలుదిశలా చాటాలని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కేలో ఇండియా లో భాగంగా కరీంనగర్‌లోని ప్రభుత్వ క్రీడా పాఠశాలలో నిర్వహించిన బాలబాలికల జిల్లా సబ్-జూనియర్ జూడో పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ముఖ్యంగా జూడో లాంటి మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిల ఆత్మరక్షణకు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. క్రీడాకారులు కోచ్ ల నుంచి మంచి మెలుకువలు నేర్చుకొని, ప్రతిభను కనబరిచి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని చాటుతూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ సాధవేణి వినయ్ కుమార్, అసోసియేషన్ కార్యదర్శి దామోదర్, వైస్ ప్రెసిడెంట్ గొర్రె శ్రీనివాస్ క్రీడా పాఠశాల నిర్వాహకులు, జూడో అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.




