Karimnagar: పైపులైన్ పనులకు భూమి పూజ మేయర్ శ్రీనివాస్
Karimnagar: కరీంనగర్ 32వ డివిజన్ హుస్సేనీ పురలో రూ. 6 లక్షలతో పైపులైన్ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్ భూమి పూజ చేసి, నీటిని పొదుపుగా వాడాలని కోరారు.
Karimnagar: పైపులైన్ పనులకు భూమి పూజ మేయర్ శ్రీనివాస్
కరీంనగర్: నగర ప్రజల త్రాగు నీటికి ఇబ్బందులు కలగకుండా చూడటమే నగరపాలక సంస్థ ప్రధాన ద్యేయమని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా గురువారం 32 వ డివిజన్ లో మేయర్ పర్యటించారు. హుస్సేనీ పుర ప్రాంతంలో స్థానిక కార్పోరేటర్ యూసుఫ్ తో కలిసి రూ. 6 లక్షల నిధులతో మంచి నీటి సరఫరా పైపు లైన్ నిర్మాణం పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభం చేశారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ....నగరంలోని ప్రతి డివిజన్‌లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రథమ లక్ష్యం అన్నారు. 32 వ డివిజన్ హుస్సేనీ పుర ప్రజలకు త్రాగు నీటికి ఇబ్బందులు లేకుండా నూతన పైపులైన్ పనుల ప్రారంభం చేశామన్నారు. ఇటీవలే డివిజన్ లో యూఐడీఎఫ్, ఎంజీఎఫ్ నిధులతో సీసీ రోడ్లు, డ్రెయినేజీ అభివృద్ధి పనులను కూడ ప్రారంభం చేశామని.. ప్రస్తుతం అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.
కార్పోరేటర్, స్థానిక ప్రజలు మా దృష్ఠికి తెచ్చిన ప్రతి సమస్యను పరిగణలోకి తీస్కోని ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేసి... డివిజన్ ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ పరిదిలోని విలీన గ్రామాల డివిజన్ల ప్రజల త్రాగు నీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే అమృత్ 1,2 పథకంలో మంచి నీటి సరఫరా పైపులైన్ పనులు చేపట్టామని ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయన్నారు.
చివరి దశలో ఉన్న పనులను త్వరలోనే పూర్తి చేసి... విలీన గ్రామాల డివిజన్ల ప్రజలకు త్రాగు నీరు అందిస్తామని తెలిపారు. నగర ప్రజల కోసం డివిజన్లలో అవసరమైన చోట ఓహెచ్ ఆర్ లు, సంపులు కూడ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. నగర ప్రజల త్రాగు నీటికి ఇబ్బందులు తలెత్తకుండా మా పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీస్కుంటుందని తెలిపారు. వచ్చే వేసవి కాలంను దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళికతో త్రాగు నీటి సరఫరాలో ప్రత్యేక చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు.
నగర ప్రజలు ఎల్ నినో ప్రభావం దృష్ట్యా నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న తాగు నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. నీటిని వృధా చేయకుండ ఆన్ ఆఫ్ నల్లాలను ఏర్పాటు చేస్కోవాలని పిలుపు నిచ్చారు. అవసరం మేరకు నీటిని వాడుకొని మిగితా సమయంలో నల్లాలను ఆఫ్ చేయాలన్నారు. మరో వైపు నగర వ్యాప్తంగా ప్రతి డివిజన్ లో యూఐడీఎఫ్, ఎంజీఎఫ్ నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
నగర అభివృద్ధి ని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు ప్రజలకు కావాల్సిన వసతులు, సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. మా పాలకవర్గం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం ముంగుకు సాగుతుందని తెలిపారు.
పనుల నాణ్యతలో రాజీ పడకుండా, నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ మేకల వెంకటేష్, బీజేపి ముజిబొద్దిన్, డీఈ వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.




