Karimnagar: డంపింగ్ యార్డు మంటలను అదుపు చేయించిన మేయర్ కొలగాని శ్రీనివాస్
Karimnagar: కరీంనగర్ డంపింగ్ యార్డులో మంటలను మేయర్ కొలగాని శ్రీనివాస్ అదుపు చేయించారు. ఏడాదిన్నరలో డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.
Karimnagar: డంపింగ్ యార్డు మంటలను అదుపు చేయించిన మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్: దశాబ్ధాలుగా పేరుకు పోయిన డంపింగ్ యార్డు చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా శనివారం పలువురు కార్పోరేటర్లు, అధికార సిబ్బంది తో కలిసి డంపింగ్ యార్డును సందర్శించి... క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తనిఖీ చేసి పరిశీలించారు. డంపింగ్ యార్డులో చెలరేగుతున్న మంటలను, పొగను అదుపు చేసేందుకు స్థానికంగా ఉండి అధికారులు సిబ్బంది తో తక్షణ చర్యలు చేపట్టారు.
మున్సిపల్ వాటర్ ట్యాంకర్లకు మోటార్ ప్రెషర్ పంపులను అమర్చి... చెలరేగుతున్న మంటలను అదుపు చేయించారు. పూర్తి స్థాయిలో మంటలు, పొగలు ఆర్పేందుకు సిబ్బందిని బృందాలుగా నియమించి... సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించి... మంటలు ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.... కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. గత 40 నుంచి 50 ఏళ్లుగా డంపింగ్ యార్డు లో 5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త పేరుకుపోయిందని...దీంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు పొగ, దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డంపు యార్డు సమస్యకు ముగింపు పలకడమే తమ పాలకవర్గం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహాకారం తో స్వచ్ఛభారత్ మిషన్ కింద రూ. 17 కోట్లతో బయోమైనింగ్ పనులు చేసేందుకు టెండర్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. త్వరలోనే బయోమైనింగ్ ప్రక్రియ కు సంబంధించి 4 యంత్రాలను ఏర్పాటు చేసి పనులు ప్రారంభం చేస్తామని స్పష్టం చేశారు.
6 నుండి 7 నెలల వ్యవధిలోనే దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను బయోమైనింగ్ ద్వారా వేగవంత చేస్తామన్నారు. కొత్తగా వచ్చే చెత్త ద్వారా గతంలోనే స్మార్ట్ సిటీలో ప్రారంభం చేసిన బయోమైనింగ్ ప్రక్రియ ఆలస్యం అవుతుందని తెలిపారు. అంతే కాకుండా బండి సంజయ్ కుమార్ గారి సహాకారంతో మరో 20 కోట్లు తెచ్చేందుకు చర్యలు తీస్కుంటూ...ప్రణాళిక ప్రకారం తమ పాలకవర్గం ముందుకు సాగుతుందని తెలిపారు.
బండి సంజయ్ కుమార్ చొరవ ద్వారా కరీంనగర్ ను అర్బన్ చాలేంజ్ ఫండ్ స్కింలో చేర్చి... 840 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అందులో డంపింగ్ యార్డు సమస్య శాశ్వత పరిష్కారం కు సాలిడ్ వేస్టు మేనేజ్మెంట్ కింద రూ. 80 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న చెత్తను ప్రక్షాళన చేయడంతో పాటు కొత్తగా రోజు వచ్చే చెత్తను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహణ చేపట్టేలా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో చెత్త గుట్టలుగా పేరుకు పోకుండ... ఏడాదిన్నర కాల వ్యవధి లో డంపింగ్ యార్డు కు శాశ్వత పరిష్కారం చేసేలా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిధులు సమకూర్చి, ఏడాది వ్యవధిలో డంపింగ్ యార్డ్ సమస్యకు ముగింపు పలుకుతామని తెలిపారు.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి, నగరంలో పారిశుధ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు మెరుగు పరుస్తుంది... తమ పాలకవర్గం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. చుట్టు ప్రక్కల ప్రజల దీర్గకాల సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయడంలో మా పాలకవర్గం కట్టుబడి ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మాసం గణేష్, పిపిఏ చంద్ర, తోట అనిల్, మేకల వెంకటేష్డి, శెట్టి వసంత లక్ష్మీ భూమయ్య, నాయకులు బండారి గాయత్రి, వెంకట్ రెడ్డి, మొండయ్య తదితరులు పాల్గొన్నారు.




