Manakondur: షాడో ఎమ్మెల్యేగా పీఏ పెత్తనం: శ్రీనాథ్ రెడ్డి!
Manakondur: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పీఏ మురళీధర్ రెడ్డిపై మాజీ యూత్ కాంగ్రెస్ నేత శ్రీనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో అవినీతి, దందాల ఆరోపణలు గుప్పించారు.
Manakondur: షాడో ఎమ్మెల్యేగా పీఏ పెత్తనం: శ్రీనాథ్ రెడ్డి!
మానకొండూర్: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతోపాటు ఆయన వ్యక్తిగత సహాయకులు (పీఏ) మురళీధర్ రెడ్డి పై మాజీ యూత్ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి, నియోజకవర్గ యువజన సంఘాల నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మానకొండూర్ షాడో ఎమ్మెల్యేగా మురళీధర్ రెడ్డి చెలామణి అవుతూ అదికారులపైన పెత్తనం చేస్తున్నాడని, ఫోన్లు చేసి ఆదేశాలు జారీ చేస్తున్నాడని శ్రీనాథ్ రెడ్డి తెలిపారు.
చెప్పింది చేయకుంటె బదిలీ చేయిస్తున్నాడని ఆరోపించారు. ఇటీవల మానకొండూర్ ఎమ్మెల్యే - క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అల్లుళ్లు, పీఏకు గొడవ వాస్తవం కాదా..? కాదంటో వారితో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి పీఏకి ఎలాంటి సంబంధం లేకున్నా ఎమ్మెల్యేకి తప్పులు చెబుతూ పూర్తిగా నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులను ఇబ్బుందులకు గురి చేస్తున్నాడని,ఎమ్మెల్యేకు దూరం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
తప్పకుండా పార్టీ కార్యకర్తల ఉసురు పీఏకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. నియోజకవర్గంలో ప్రతి పనికీ కమీషన్లు వసూలు చేస్తున్నాడని, భూములు, గ్రానైట్, ఇసుక క్వారీల వద్ద గొడవలు సృష్టించి సెటిల్ మెంట్లు చేస్తున్నాడని ఆరోపించారు. కరీంనగర్ లో కోటి రూపాయల ఇల్లును కొనుగోలు చేసినాడని, అక్రమ సంపాదన కాదా అంటూ ప్రశ్నించారు. కొత్తపల్లి ఇసుక క్వారీలో కోటి రూపాయలు వసూలు చేశాడని ఆరోపించారు.
నియోజకవర్గంలో ప్రతీ పనిలో, వెంచర్లలో ముడుపులు వసూలు చేస్తున్నాడని ఆరోపించారు. భయపడి రియల్టర్లు బిజినెస్ చేయడం లేదన్నారు. ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు కష్టపడి గెలిపిస్తే నాయకుల మధ్య, పార్టీలో విభేదాలు సృష్టించి పీఏ ఎమ్మెల్యేను మోసం చేస్తున్నాడని, ఆయనకు తెలియకుండా సెటిల్ మెంట్లు చేస్తున్నాడని, చివరకు మంత్రి పదవి రాకపోవడానికి పీఏ కారణమయ్యాడని ఆరోపించారు. డెన్మార్క్ లో లోన్లు తీసుకుని పారిపోయి వచ్చిన దొంగ అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
క్యాంపు ఆఫీసు వద్ద ఆత్మహత్యకు యత్నించి ప్రాణాలు కోల్పోయిన బేతెల్లి రాజేందర్ రెడ్డి తప్పులు కేసులు పెట్టించి చావుకు పీఐ కారణమై ఎమ్మెల్యే వద్ద తనను బదనాం చేశాడని శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. కండిషన్ బెయిల్ పై వచ్చిన పీఏ వద్దకు పోలీసులే వెళ్లి సంతకాలు తీసుకున్నారని. ఆయన స్టేషన్ కి వెళ్లలేదని ఆరోపించారు. సీసీ కెమెరాలు, సంతకాలపై సమాచార హక్కు చట్టం కింద అడిగితే సీసీ కెమెరాలు లేవని సమాధానం స్టేషన్ అధికారులు ఇచ్చారని తెలిపారు.
బెజ్జంకి మండలంలో బీఆర్ఎస్ నాయకుని 40ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచుతాని ఎన్నికలకు మందు ఎమ్మెల్యే హామిచ్చిడాని, ఇప్పుడు పీఏ డీల్ కుదిర్చి దానిని మరుగున పెట్టాడని ఆరోపించారు. ఎల్ఎండీ రిజర్వాయర్ లో నిత్యం నడుస్తున్న జేసీబీకో మట్టి అక్రమ రవాణా చేయిస్తున్నదెవరని ప్రశ్నించారు.
నిత్యం వార్తలు రాస్తున్నపత్రికలు, ఛానళ్లపైన, నాయకులపైన పీఏ సత్యాన్వేషణలో తప్పుడు వార్తలు రాయిస్తున్నాడని, దీనికి ఎడిటర్, రిపోర్టర్ ఎవరని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు విలువలు కాపాడుకోవాలని, పీఏకి భయపడకుండా ఉండాలని, ఎవరికైనా తాము అండగా ఉంటామని తెలిపారు. ఎమ్మెల్యే పేరు చెప్పుకోకుండా, ఆయన అండ లేకుండా బయటకు వస్తావా అంటూ పీఏకి సవాల్ విసిరారు.




