Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా జయపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు!

Karimnagar: కరీంనగర్ మైత్రి టవర్స్‌లో జయపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనం; వ్యాపార రంగంలో రాణిస్తూ ఆయన అందిస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడిన నాయకులు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 1 Oct 2026 2:36 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్‌లో ఘనంగా జయపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు!

Karimnagar: జయపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మైత్రి టవర్స్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, మిత్రమండలి సభ్యులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన నేతలు జయపాల్ రెడ్డి వ్యాపార రంగంలో రాణిస్తూనే, ప్రజాసేవలో ముందంజలో ఉన్నారని కొనియాడారు.

ప్రజల సమస్యలపై స్పందిస్తూ అనేక సామాజిక, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రశంసించారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి తనకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగా ఎంతో మందిని ఆదుకున్నాడని అన్నారు. కరీంనగర్ ప్రజల ఆశీస్సులతో ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN