Karimnagar: కరీంనగర్ చింతకుంట వద్ద బీజేపీ నిరసన, ఉద్రిక్తత!

Karimnagar: కరీంనగర్ చింతకుంట వద్ద కాకతీయ కెనాల్‌లో నీరు వదలాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నిరసన.. పోలీసుల లాఠీచార్జ్, నాయకుల అరెస్ట్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Updated on: 21 Sept 2026 12:53 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ చింతకుంట వద్ద బీజేపీ నిరసన, ఉద్రిక్తత!

Karimnagar: వినాయక నిమజ్జనానికి కాకతీయ కెనాల్ లో నీటిని వదలాలని బిజెపి ఆధ్వర్యంలో చింతకుంట కెనాల్ వద్ద నిరసన తెలిపిన బిజెపి కార్యకర్తలు నాయకులు. వేములవాడ కరీంనగర్ వెళ్లే రహదారి కావడంతో భారీగా నిలిచిపోయిన వాహనాలు. నీటిని వదలడానికి ప్రభుత్వానికి తెలుపుతామని పోలీసులు ధర్నాలు విరమించాలని బిజెపి నాయకులకు కార్యకర్తలకు సూచించారు.

రోడ్డుపై నుండి ససేమిరా లేవకపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేసే క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరుగుతున్న సమయంలో కొందరు బిజెపి కార్యకర్తలు అత్యుత్సాహంతో పోలీసు వాహనం ఎక్కడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న సిఐ వాహనం దిగుమని చెప్పడంతో దిగకపోవడంతో లాటితో చితకబాది వాహనం నుండి దించి వేశాడు. దీనితో బిజెపి కార్యకర్తలు ఒక్కసారిగా పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. భారీగా మోహరించిన పోలీసులు బిజెపి నాయకులను కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి పి టి సి కి తరలించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN