Karimnagar: కలెక్టరేట్ ఉద్యోగి రమేష్ రావుపై కేవీపీఎస్ ఫిర్యాదు!

Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ సీసీ రమేష్ రావు ప్రవర్తనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి కేవీపీఎస్ డిమాండ్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 9 Oct 2026 6:33 PM IST
Karimnagar
X

Karimnagar: కలెక్టరేట్ ఉద్యోగి రమేష్ రావుపై కేవీపీఎస్ ఫిర్యాదు!

Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో సి.సి. గా విధులు నిర్వహిస్తున్న రమేష్ రావు అనే ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వడ్లూరి కిషోర్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రజావాణి కార్యక్రమం ద్వారా ఒక వినతిపత్రాన్ని ప్రజా భవాన్ సమర్పించారు.

ఈ సందర్భంగా వడ్లూరి కిషోర్ మాట్లాడుతూ, రమేష్ రావు గత 20 సంవత్సరాలుగా ఒకే విభాగంలో డిప్యుటేషన్ పై కొనసాగుతున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు ఆయనను వేరే డిపార్ట్‌మెంట్‌కు బదిలీ చేసినప్పటికీ, ఆ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ పాత స్థానంలోనే తిష్ట వేసుకుని కూర్చున్నారని ఆరోపించారు. కలెక్టరేట్‌కు తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను, బాధితులను కలెక్టర్ ని కలవనీయకుండా రమేష్ రావు అడ్డుకుంటున్నారని విమర్శించారు. అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని, తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

తనకు ఇంకా ఒక సంవత్సరమే సర్వీస్ ఉందని, తాను పదవీ విరమణ చేస్తే తనను ఎవరూ ఏమీ చేయలేరనే అహంకారపూరిత వ్యాఖ్యలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రమేష్ రావు వ్యవహారశైలిపై సమగ్ర విచారణ జరిపి, ఆయనపై తక్షణమే శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, కలెక్టరేట్‌కు వచ్చే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రికి సమర్పించిన వినతిపత్రంలో KVPS ప్రతినిధులు కోరారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి, తదుపరి చర్యల నిమిత్తం దీనిని కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు ఫార్వార్డ్ చేశారని తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN