Karimnagar: పేదలకు భరోసా కల్పించేందుకే సంక్షేమ పథకాలు

Karimnagar: కరీంనగర్ 2వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో కేఎన్ఆర్ మార్నింగ్ వాక్ నిర్వహించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 28 Nov 2026 11:19 PM IST
Karimnagar
X

Karimnagar: పేదలకు భరోసా కల్పించేందుకే సంక్షేమ పథకాలు

కరీంనగర్: ఇందిరమ్మ కుటుంబ భీమా పై అవగాహన కల్పిస్తూ,అర్హత ఉండి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కానివారికి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చిన సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. పేద మధ్యతరగతి కుటుంబాలకు భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.

కేఎన్ఆర్ మార్నింగ్ వాక్ లో భాగంగా 2 వ డివిజన్ తీగలగుట్టపల్లి అంబేద్కర్ కాలనీలో అందరిని పలకరిస్తూ ఇందిరమ్మ కుటుంబ భీమా పై అవగాహన కల్పిస్తూ నరేందర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి మార్నింగ్ వాక్ లో చేశారు.ఈ సందర్భంగా అర్హత ఉండి కొన్ని కారణాలతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాని వారు నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.

వారి యొక్క వివరాలు తీసుకొని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కాశెట్టి శ్రీనివాస్, కొలగాని అనిల్, మెతుకు కాంతయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి,కూన దామోదర్,ఎట్టెపు వేణు,అంజయ్య,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR