Jammikunta: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: యూత్ కాంగ్రెస్!

Jammikunta: రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఢిల్లీ మార్చ్‌కు మద్దతుగా కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో యూత్ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

GANESH, JAMMIKUNTA
Published on: 1 Nov 2026 4:31 PM IST
Jammikunta
X

Jammikunta: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి: యూత్ కాంగ్రెస్!

జమ్మికుంట: రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీ రాంలీలా మైదానం లో చేపట్టిన మహా మార్చ్ కీ మద్దతుగా యూత్ కాంగ్రెస్, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో, జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌరస్తాలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరమనేని పరుశురాం, సుంకరి రమేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపెల్లి నాగరాజు, కౌన్సిలర్ శ్రీపతి నరేష్, ఒగ్గు రమేష్, చందా రాజు, తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసాల రామస్వామి మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను బలహీనపరిచే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు.

ప్రజల ఓట్లతో అధికారంలోకి రావాల్సిన ప్రభుత్వం, ఓటర్ల జాబితాల ప్రక్షాళన పేరుతో అర్హులైన పౌరుల ఓటు హక్కుకు నష్టం కలిగించే పరిస్థితులు ఎందుకు సృష్టిస్తోందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని, ప్రజల ఓటే ప్రభుత్వాల అధికారానికి పునాది అని పేర్కొన్నారు. అలాంటి ఓటు హక్కును కాపాడాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం తన స్వతంత్రతను నిరూపించుకోవాల్సిన సమయంలో, దాని పనితీరుపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందనే విమర్శలకు ఎన్నికల సంఘం తన పారదర్శక చర్యలతో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

CEC జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి ఎన్నికల సంఘం అనేది కేంద్ర ప్రభుత్వానికి అనుబంధ సంస్థ కాదని, అది భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన స్వతంత్ర సంస్థ అని గుర్తుంచుకోవాలన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ప్రయోజనాల కంటే రాజ్యాంగం, ప్రజల ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలే అత్యున్నతమని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘంపై ప్రజలకు నమ్మకం కల్పించడంలో విఫలమైతే ఆ పదవిలో కొనసాగడానికి నైతిక హక్కు ఏమిటని ప్రశ్నించారు. జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

SIR ప్రక్రియ పేరుతో అర్హులైన ఓటర్ల హక్కులను ప్రమాదంలోకి నెట్టకూడదు. ఓటర్ల జాబితాలో తప్పులను సరిచేయడం పేరుతో నిజమైన భారతీయ పౌరుల ఓట్లను తొలగించే పరిస్థితి ఏర్పడితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఒక పౌరుడి ఓటు తొలగించే ముందు సరైన విచారణ, స్పష్టమైన కారణం, నోటీసు, అభ్యంతరాలు తెలిపే అవకాశం తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘమే ఓటర్లలో భయాందోళనలు సృష్టించే పరిస్థితికి కారణం కాకూడదన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశవ్యాప్తంగా కోట్లాది ఓట్ల తొలగింపునకు సంబంధించిన ప్రకటనలు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. తొలగించిన ఓట్లలో ఎంతమంది అనర్హులు? ఎంతమంది నిజమైన ఓటర్లు? ఎంతమంది విదేశీ అక్రమ చొరబాటుదారులుగా గుర్తించబడ్డారు? ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? ఎంతమందిని బహిష్కరించారు? అనే ప్రశ్నలకు గణాంకాలతో సహా సమాధానం చెప్పాలని నిలదీశారు. కోట్లాది ఓట్లు తొలగించామని చెప్పడం సులభమే కానీ, ఆ తొలగింపునకు సంబంధించిన పూర్తి ఆధారాలు ప్రజల ముందుంచడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.

ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టపరమైన మార్పులపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, నియామక ప్రక్రియలో రాజకీయ ఆధిపత్యానికి అవకాశం కల్పించే విధానాలను సమీక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్లకు కల్పించిన చట్టపరమైన రక్షణలు, జవాబుదారీతనం విషయంలోనూ పారదర్శకత ఉండాలన్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుంచుకునే విధానాన్ని విడనాడాలని, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతను గౌరవించాలని హితవు పలికారు. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నాయనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల సంఘంపై ఉందన్నారు.

దేశ ప్రజల ఓటు హక్కుతో రాజకీయం చేయడం మానుకోవాలి. ఓటు హక్కు ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడినది కాదు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఒక్క అర్హుడి ఓటు తొలగినా అది ప్రజాస్వామ్యానికి జరిగిన నష్టమే. అందుకే అర్హులైన ప్రతి పౌరుడి ఓటును కాపాడాలని, SIR ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, తొలగించిన ఓట్ల పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని, CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ నేతృత్వంలో, దేశవ్యాప్తంగా సాగుతున్న ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రజల ఓట్లను కాపాడేంత వరకు, రాజ్యాంగాన్ని రక్షించుకునే వరకు ఈ పోరాటం ఆగదని అన్నారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మహేష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శులు పంజాల అజయ్, గొడుగు మానస, పాతకాల రమేష్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు దేవునూరి వినయ్, రాచపల్లి సాగర్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, జమ్మికుంట మండల మహిళా అధ్యక్షురాలు తోట స్వప్న, పిడుగు భాగ్య, కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాల అధ్యక్షులు, సేవాదళ్ పట్టణ అధ్యక్షులు బండి పవన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, లింగారావు, తిరుపతి రెడ్డి, అజయ్, రమేష్, ప్రవీణ్, అశోక్, ప్రశాంత్, నాగరాజు, జావిద్, అస్రఫ్, చందు, రాకేష్, సంపత్, వెంకటేష్ కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA