Jammikunta: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆసరా!

Jammikunta: జమ్మికుంటలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గిరవేణ శ్యామ్ పెద్ద కుమార్తె సంయుక్త పేరుపై పల్లె అఖిల-విక్రమ్ దంపతులు రూ.20,000 పోస్టాఫీసులో డిపాజిట్ చేసి ఆదర్శంగా నిలిచారు.

GANESH, JAMMIKUNTA
Published on: 13 Oct 2026 7:22 PM IST
Jammikunta
X

Jammikunta: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఆసరా!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన గిరవేణ శ్యామ్ ఇటీవల జమ్మికుంట పట్టణంలోని ఎఫ్‌సీఐ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ విషయం తెలుసుకున్న పల్లె లవకుమార్ కుమార్తె, అల్లుడు పల్లె అఖిల–విక్రమ్ దంపతులు మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి అండగా నిలిచారు.

మృతుడి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, ఆయన పెద్ద కుమార్తె గిరవేణ సంయుక్త భవిష్యత్తుకు ఉపయోగపడాలనే గొప్ప ఆలోచనతో రూ.20,000 మొత్తాన్ని ఆమె పేరు మీద పోస్టాఫీసులో డిపాజిట్ చేశారు. తండ్రిని కోల్పోయిన చిన్నారికి భవిష్యత్తులో ఈ మొత్తం కొంతైనా తోడ్పడాలనే వారి ఆలోచన ఎంతో అభినందనీయం.

కష్టాల్లో ఉన్న కుటుంబానికి సాయం చేయడమే కాకుండా, ఒక చిన్నారి భవిష్యత్తు గురించి ఆలోచించి ముందడుగు వేయడం వారి గొప్ప మనసుకు నిదర్శనం.ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వం. చిన్నారి భవిష్యత్తుకు భరోసానిస్తూ ఆదర్శంగా నిలిచిన పల్లె అఖిల–విక్రమ్ దంపతులకు గ్రామస్థుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA