Jammikunta: రంగమ్మపల్లెలో ఇంటింటికీ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ!

Jammikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పరిధిలోని రంగమ్మపల్లె ఎస్సీ కాలనీలో 314 మందికి డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. స్మార్ట్ కార్డులపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

GANESH, JAMMIKUNTA
Published on: 26 Oct 2026 5:11 PM IST
Jammikunta
X

Jammikunta: రంగమ్మపల్లెలో ఇంటింటికీ డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ!

జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని జగ్గయ్యపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని రంగమ్మపల్లె ఎస్సీ కాలనీ వాసులకు 314 మంది డిజిటల్ రేషన్ కార్డు ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేషన్ కార్డు డిజిటల్ పంపిణీ చేశారు.

ఎమ్మార్వో గ్రామ పంచాయతీ పరిధిలోని ఉన్న ప్రజలకు డిజిటల్ రేషన్ కార్డు పంపిణీ చేయాలని జగ్గయ్యపల్లె గ్రామపంచాయతీ కారోబార్ తక్కలపల్లి రాజేశ్వరరావు కు అందజేశారు. ఇంటింటికి తిరుగుతూ డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు ప్రజలు కూడా చాలా సంతోషపడుతున్నారు.

కార్డు చిన్నగా మంచిగా ఉందని కాగితం రూపంలో ఉన్నపుడు అది మడతపెట్టితే దానికి అక్షరాలు పోయేవని దాని యొక్క నెంబర్ పోవడం వల్ల రేషన్ షాపులకు పోతే నెంబర్ కనబడడం లేదని అదో ఏదో తిప్పలు పడే వాళ్ళమని అలాంటి తిప్పలు ఉండదని ఇప్పుడు చిన్నగా డిజిటల్ కార్డు ఫోటో రూపంలో రావడం వల్లచాలా ఆనందంగా ఉందని ప్రజలు కూడా సంతోష పడుతున్నారు.

GANESH, JAMMIKUNTA

GANESH, JAMMIKUNTA