Karimnagar: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాల ఆరోపణలు.. పేదలకు అన్యాయం
Karimnagar: కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక, ఇల్లంతకుంట మండలాల్లో ఇళ్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Karimnagar: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాల ఆరోపణలు.. పేదలకు అన్యాయం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వీణవంక మండలం ఇల్లంతకుంట మండలంలో ఇళ్లు ఉన్నవారికే మళ్లీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారని, నిజంగా ఇళ్లు లేని నిరుపేదలు మాత్రం అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు.అంతేకాదు, ఇల్లు లేని అర్హులైన పేదల నుంచి డబ్బులు అడుగుతున్నారనే ఆరోపణలు కూడావినిపిస్తున్నాయి.
ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకంలో నిజమైన పేదలకు అన్యాయం జరిగితే ఎలా? ఇళ్లు ఉన్నవారికి ఇళ్లు ఎలా మంజూరు అవుతున్నాయి? ఇళ్లు మంజూరు చేసిన వారి దగ్గర డబ్బులుఎందుకు.అడుగుతున్నారు?ఇది ఇందిరమ్మ రాజ్యమా.లేక పేదల ఆశలపై నీళ్లు చల్లే పాలనా? ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఎవ్వరికి ఒక పైసా కూడా ఇవ్వద్దని ఇందిరమ్మ ఇళ్లకు అని చెప్పుకుంటూ పోతున్న నాయకులు అధికారులు
ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించాలని, అర్హులైన నిరుపేదలను గుర్తించి వారికి న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. ఇల్లు మంజూరైన వారి ఆశలు నిరాశలైతయా నిరుపేదల ఆవేదన




