Karimnagar: బతుకమ్మ, దసరా వేడుకలకు రూ.2.80 కోట్లు: మేయర్ కొలగాని

Karimnagar: కరీంనగర్‌లో బతుకమ్మ, దసరా ఉత్సవాలను గతం కంటే ఘనంగా నిర్వహించేందుకు రూ.2.80 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 8 Oct 2026 7:18 PM IST
Karimnagar
X

Karimnagar: బతుకమ్మ, దసరా వేడుకలకు రూ.2.80 కోట్లు: మేయర్ కొలగాని

కరీంనగర్: ​తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలైన బతుకమ్మ, దసరా ఉత్సవాలను గతం కంటే ఎంతో గొప్పగా నిర్వహించేలా... ఘనంగా ఏర్పాట్లు చేస్తామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు.

కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ సమక్షంలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుధ్య విభాగాల అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం జరిగింది. ఈ నెల 10వ తేదీ నుండి 20వ తేదీ వరకు వైభవంగా జరగనున్న బతుకమ్మ, దసరా, దేవి నవరాత్రుల, ఉత్సవాలకు నగరపాలక సంస్థ ఆద్వర్యంలో రూ. 2.80 కోట్ల అంచనా నిధులతో విస్తృత ఏర్పాట్లు చేసేందుకు సమాయత్తమైంది.

ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ 66 డివిజన్ల బతుకమ్మ పాయింట్లతో పాటు నిమజ్జనం పాయింట్లు, అంభేడ్కర్ స్టేడియం దసరా ఉత్సవాలకు చేయాల్సిన సివిల్ పనులు, ఎలక్ట్రికల్ పనులు, పారిశుధ్య నిర్వహణ ఇతర ఏర్పాట్ల పై డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ సుదీర్ఘంగా చర్చించారు. టెండర్ల ప్రక్రియ, ఏర్పాట్లు, వసతి సౌకర్యాల పై అధికారులు సిబ్బందికి పలు సూచనలతో దిశానిర్దేశం చేస్తూ.. ఆదేశాలు జారీ చేశారు.

ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ... తెలంగాణ ఆడబిడ్డల సంస్కృతి సాంప్రదాయ పండగ బతుకమ్మ, దసరా వేడుకలను నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. గతం కంటే చాలా గొప్పగా ప్రజలకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా సుమారు 2.80 కోట్ల రూ. నిధులు కేటాయించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికే టెండర్ ప్రక్రియలను పూర్తి చేశామని... పనుల కేటాయింపుల పై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి అధికారులు సిబ్బందికి తగిన సలహా సూచనలతో ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. బతుకమ్మ పండగ తెలంగాణ ఆడ పడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సాంప్రదాయానికి ప్రతిక కాబట్టి... మహిళలు ఆనందోత్సవాల మద్య బతుకమ్మ వేడుకలు జరుపుకునేలా నగరపాలక సంస్థ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. డివిజన్ల లో బతుకమ్మ ఆడే ప్రదేశాలు, నిమజ్జనం పాయింట్ల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.

నగర వ్యాప్తంగా మెరుగైన పాయిశుద్య నిర్వహణ, వీది దీపాల ఏర్పాటు, చక్కటి లైటింగ్, సౌండ్ సిస్టమ్, త్రాగు నీటి వసతి, పాయింట్ల వద్ద చదును మరమ్మతులు, నిమజ్జనం పాయింట్ల వద్ద బారీకేడింగ్, అవసరమైన చోట అదనపు లైటింగ్, పారిశుధ్యం, స్టేజ్ ల ఏర్పాటు, సౌండ్ లైటింగ్, జనరేటర్లు, మహిళల బధ్రత తదితర వసతులు సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత ఏర్పాట్లు, పై అన్ని విభాగ అధికారులు, పోలీస్, విద్యుత్ శాఖల సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. టెండర్ పనులు వచ్చిన కాంట్రాక్టర్లతో మూడు రోజుల ముందస్తుగానే పనులు పూర్తి చేసేలా... సౌకర్యాలు కల్పించేలా ఇంజనీరింగ్ అధికారులు వారికి సూచించాలన్నారు. పనులు జరిగే సమయంలో పర్యవేక్షణ చాలా ముఖ్యం అని అన్నారు.

అంబేడ్కర్ స్టేడియంలో జరిగే దసరా ఏర్పాట్లు, కల్చరల్ కార్యక్రమాలు లైటింగ్, స్టేజ్ నిర్మాణం, రావణ దహాన కార్యక్రమానికి కూడ తగిన ఏర్పాట్లు చేసేలా అధికారులకు సూచించామని తెలిపారు. కార్పోరేటర్ల సలహా, సూచనలు స్వీకరించి... వారి సమన్వయంతో బతుకమ్మ ప్రదేశాల్లో లోటు పాట్లు లేకుండ ఏర్పాట్లు చేయాలన్నారు. డివిజన్లలో లాటు పాట్లు జరగకుండా అదనంగా ఏర్పాట్లు ఉండేలా చూడాలన్నారు. ఎక్కడ ఎలాంటి లోటు పాట్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బతుకమ్మ, దసరా ఉత్సవాల ఏర్పాట్లు చేసి విజయవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరో వైపు డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... బతుకమ్మ, దసరా పండగ వాతావరణం ఉట్టి పడేలా తగిన ఏర్పాట్లు చేసి... మహిళలు ఆనందోత్సవాల మద్య బతుకమ్మ పండగ జరుపుకునేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తూ... ముందస్థుగా ఏర్పాట్లను పూర్తి చేసేలా కాంట్రాక్టర్లతో సమన్వయం చేస్కోవాలన్నారు. ఎక్కడ ఎలాంటి లోటు పాట్లు లేకుండ అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దసరా ఉత్సవాల్లో రావణదహానంకు, కల్చర్ కార్యక్రమాలు సరిపడేలా ఏర్పాట్లు చేసి... నిమజ్జనం వద్ద ఇబ్బందులు రాకుండా అధికారులు బాధ్యత వహించాలన్నారు.

మరో వైపు కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ... ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు, పొరపాట్లు జరగకుండా, లోటు పాట్లను సవరిస్తూ... బతుకమ్మ, దసరా కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రణాళిక బద్దంగా... ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించి తగిన ఏర్పాట్లు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. సివిల్, లైటింగ్ అరేంజ్ మెంట్లను ప్రాధాన్యతగా తీస్కోని పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. బతుకమ్మ నిమజ్జనం పాయింట్ల వద్ద ప్రమాదాలు జరగకుండ చర్యలు తీస్కోని... సమన్వయంతో విధులు చేపట్టాలన్నారు. గణేష్ ఉత్సవాల మాదిరిగానే బతుకమ్మ దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కమీషనర్ ఆయాజ్, డిప్యూటీకమీషనర్లు ఖాధర్ మొహియుద్దీన్, వేణు మాధవ్, అసిస్టెంట్ కమీషనర్ రాజమనోహర్, ఇంచార్జ్ ఈఈ లచ్చిరెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN