Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా!

Karimnagar: కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంపై ఆందోళన, తక్షణమే విడుదల చేయాలని డిమాండ్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 6 Nov 2026 3:07 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట గ్రామపంచాయతీ కార్మికుల ధర్నా!

Karimnagar: రెండు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని గ్రామపంచాయతీ కార్మికులు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామపంచాయతీ యూనియన్ కార్యదర్శి మాట్లాడుతూ గత రెండు నెలలుగా వేదనాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణలో పెద్ద పండుగ అయిన దసరాకు కూడా వేతనాలు ఇవ్వలేదని, ఇప్పుడు వస్తున్న దీపావళి పండుగకు కూడా వేతనాలు లేక కార్మికులు నాన్న ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

తక్షణమే రావలసిన రెండు నెలల వేతనాలను వెంటనే విడుదల చేసి కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అధికారులను కోరారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కనీస వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులపై పని భారం పెడుతూ తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమిస్తూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అలాంటి పనులు చేస్తున్న సర్పంచ్లను వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. తొలగించిన కార్మికులను తిరిగి తీసుకోవాలని, గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని లేనియెడల రాబోవు రోజుల్లో టోకెన్ సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా గ్రామపంచాయతీ కార్మికులు సిఐటియు నాయకులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN