Karimnagar: గీతా కార్మికులకు షరతులు లేకుండా పెన్షన్ ఇవ్వాలి

Karimnagar: గీతా కార్మికులకు ఇన్ స్టంట్ పెన్షన్ నిర్ణయంపై హర్షం. 37,381 మందికి వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలని కరీంనగర్ లో డిమాండ్.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 31 Oct 2026 6:48 PM IST
Karimnagar
X

Karimnagar: గీతా కార్మికులకు షరతులు లేకుండా పెన్షన్ ఇవ్వాలి

కరీంనగర్: పెన్షన్ దారులైన గీత కార్మికులు మరణిస్తే వారి భార్యలకు వెంటనే పెన్షన్ ఇచ్చే విధానం (ఇన్ స్టంట్) అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.

గీత కార్మికుడు మరణిస్తే వారి భార్య మళ్లీ పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలనే పద్ధతి తీసివేయాలని గత అనేక సంవత్సరాలుగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ వచ్చింది. ఇటీవల జరిగిన అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్రలో కూడా ఈ డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు జిల్లాకమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం.

అలాగే ఇటీవల పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్న 37,381 మంది గీత కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ వెంటనే ఇవ్వాలని లేకుంటే కరీంనగర్ జిల్లాలోని గీత కార్మికులు కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడిస్తామని ఇంకా అమలు గాని పక్షంలో అమర నిరాహార దీక్ష అయినా చేస్తామని అన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR