Karimnagar: కరీంనగర్లో కపిల్ చిట్స్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద క్యాంపు
Karimnagar: కరీంనగర్లో కపిల్ చిట్స్, హనుమకొండ ఆయుర్వేద హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం; ప్రతి నెల 2, 4 శనివారాల్లో నిర్వహిస్తామని నిర్వాహకుల వెల్లడి.
Karimnagar: కరీంనగర్లో కపిల్ చిట్స్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద క్యాంపు
కరీంనగర్: నగరంలో కరీంనగర్ కపిల్ చిట్స్ ఆధ్వర్యంలో ఉచిత ఆయుర్వేద క్యాంపు ను నిర్వహించారు, ఈ ఆయుర్వేద క్యాంపులో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలతో పాటు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి తగిన సూచనలు సలహాలు సూచించారు. కరీంనగర్ లో మొదటిసారి కపిల్ చిట్స్ ఆయుర్వేద హాస్పిటల్ హనుమకొండ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ క్యాంపుకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఎంతోమంది తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారని అలాంటివారికి ఆయుర్వేదం ఒక వరమని అన్నారు. ఎన్నో మొండి వ్యాధులకు ఆయుర్వేదంలో మంచి చికిత్స ఉందని ఇలాంటి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
కరీంనగర్ కపిల్ చిట్స్ ఈడి శ్రీనివాస్, బ్రాంచి మేనేజర్ కాచం లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని ప్రతి నెల కరీంనగర్లో రెండవ శనివారము నాలుగవ శనివారము నిర్వహిస్తామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయుర్వేదం అనేది మన భారతదేశంలో అతి పురాతనమైన వైద్య విధానం అని ఈ వైద్య విధానంలో రోగాలకు వైద్యం అందుబాటులో ఉందని డాక్టర్లు తెలిపారని ప్రజలు ఆయుర్వేదం పై అవగాహన కల్పించడంతో పాటు ఉచిత వైద్యం అందించి ప్రజలకు మంచి ఆరోగ్య జీవన విధానాన్ని పెంచడం కోసం కపిల్ చిట్స్ ముందుకు వచ్చిందని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.
కరీంనగర్ ఆయుర్వేద శిబిరానికి విశేష స్పందన...
కరీంనగర్ లో కపిల్ చిట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద శిబిరానికి విశేష స్పందన లభించింది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న జగన్నాథం ,మల్లేశం బుచ్చన్న మాట్లాడుతూ అనేక రకాలైన ఒళ్ళు నొప్పులు, చర్మ వ్యాధులకు ఎలాంటి చికిత్సలు తీసుకున్న తగ్గకపోవడంతో ఆయుర్వేదం పై నమ్మకంతో ఈ క్యాంపుకు వచ్చామని డాక్టర్లు సలహాలు సూచనలు, ఆహార నియమాలతో పాటు మంచి మందులు సూచించి, ఆరోగ్య శ్రద్ధలు వివరించాలని తెలిపారు. మనిషి జీవన విధానం ఎలాంటి మార్పులు జరుగుతుంది మనిషి తీసుకోవలసిన జాగ్రత్తలు డాక్టర్లు ఎంతో ఓపికతో వివరించాలని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఉచిత ఆయుర్వేద క్యాంపును కొనసాగించాలని ఆయుర్వేదం పై ప్రజలకు అవగాహన కల్పించాలని వారు ప్రత్యేకంగా కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రవణ్ కుమార్, డాక్టర్ కృష్ణస్వామి, (కేరళ) డాక్టర్ రష్మిక, హైదరాబాద్ కరీంనగర్ కపిల్ చిట్స్ ఈ డి శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ కాచం లక్ష్మణ్ కుమార్, కపిల్ హెల్త్ క్లబ్ మేనేజర్ ఉపేందర్ రావు, మేనేజర్ మహేందర్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ సునీల్, డిజిటల్ మేనేజర్ శశి కుమార్, కపిల్ చిట్స్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.




