Karimnagar: స్మార్ట్ సిటీ నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా?
Karimnagar: స్మార్ట్ సిటీ నిధులను బండి సంజయే తెచ్చినట్లు నిరూపిస్తే దుర్గామాత వద్ద ప్రమాణం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మాజీ మేయర్ రవీందర్ సింగ్ సవాల్.
Karimnagar: స్మార్ట్ సిటీ నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా?
Karimnagar: నగరంలో చేపట్టిన ప్రతిష్టాత్మక 'స్మార్ట్ సిటీ' ప్రాజెక్టు నిధులను కేంద్ర మంత్రి బండి సంజయే తెచ్చినట్లు బీజేపీ నాయకులు ఊదరగొడుతున్నారని, దమ్ముంటే దీనిపై బండి సంజయ్ దుర్గామాత వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సవాల్ విసిరారు. చేతకాని తనంతో కేవలం ప్రెస్‌మీట్లు, అబద్ధపు ప్రచారాలకే బీజేపీ పరిమితమైందని ధ్వజమెత్తారు. నగర ప్రజల సమస్యలను గాలికొదిలేసి, కేవలం రాజకీయ లబ్ది కోసం కుట్ర రాజకీయాలు చేయడం ఆ పార్టీ నేతల నైజంగా మారిందని మండిపడ్డారు.
అభివృద్ధి ప్రధాత, బీసీ నేత గంగుల కమలాకర్‌పై విమర్శలా? సహించేది లేదు!
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, కరీంనగర్‌ను రాష్ట్రంలోనే నంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ మంత్రి గంగుల కమలాకర్‌దేనని నాయకులు స్పష్టం చేశారు. రాజకీయంగా ఆయనను ఎదుర్కొనే దమ్ములేకనే కొందరు పనిగట్టుకుని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని హెచ్చరించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అగ్రనేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కరీంనగర్ ప్రజలు, బీఆర్‌ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవని, తగిన రీతిలో బుద్ధి చెబుతామని తీవ్రంగా హెచ్చరించారు. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి తప్ప, వ్యక్తిగత దూషణలకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.




