Karimnagar: నిమజ్జనం నీటిపై బీజేపీ ధర్నా ఓ డ్రామా: నరేందర్ రెడ్డి
Karimnagar: కరీంనగర్ చింతకుంట కెనాల్ వద్ద గణేష్ నిమజ్జన నీటి విడుదలపై బీజేపీ చేసింది ధర్నా డ్రామా అని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు.
Karimnagar: నిమజ్జనం నీటిపై బీజేపీ ధర్నా ఓ డ్రామా: నరేందర్ రెడ్డి
కరీంనగర్: మంత్రులు ఎప్పటికప్పుడు గణేశ్ నవరాత్రి ఉత్సలవాలపై నిమజ్జన ఏర్పాట్లపై నీటి విడుదలపై వివిధ సందర్భాలలో వారం రోజులుగా మానిటరింగ్ చేస్తున్నారని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నిమజ్జనానికి ప్రభుత్వం నీటిని విడుదల చేయదని తప్పుడు ప్రచారం చేసిన బిజెపి చింతకుంట కెనాల్ వద్దకు చేరుకొని ధర్నా చేయడం ఒక డ్రామా అని మండిపడ్డారు.
నిన్నటినుండే అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మిషనరీ వచ్చింది కెనాల్ లో సిల్ట్ తీసిండ్రు,డస్ట్ పోసిండ్రు ఇవన్నీ ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతుంటే బీజేపీ ధర్నా చేయగానే 5 నిమిషాలలో వారి పోరాటంతో ప్రభుత్వం నీటి విడుదలకు నిర్ణయం తీసుకుందని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు.
బీజేపీ ధర్నా చేసిన 5 నిమిషాలలో ప్రభుత్వం నీటి విడుదల పై నిర్ణయం తీసుకున్నట్టు తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. 11 గం లకు ధర్నా అని పెట్టి 11 గంటలకు నీరు విడుదలవుతుందని తెలుసుకొని 10:30 కే ధర్నా చేయడం వీరి డ్రామాకు పరాకాష్ట అని ఎప్పటికీ డ్రామా ఈ ట్రిక్స్ పని చేయవని బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలని సూచించారు.
ఇక బీజేపీ డ్రామాలు నడవనీయం..
కరీంనగర్ అభివృద్ధిపై అన్ని పండుగల నిర్వహణ పై ప్రజలకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంత్రులు మేము ఎప్పటికప్పుడు చిత్త శుద్ధితో ముందుకెళ్తున్నాము. అన్ని వర్గాల మనోభావాలను గౌరవిస్తాం ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటామని తెలిపారు.
గత రెండు సంవత్సరముల నుండి చింతకుంట వద్ద నిమజ్జనం ఏర్పాట్లు చేస్తున్నామని ఇప్పుడే కావాలని రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రచురించారు. ఎస్సారెస్పీలో నీటిని విడుదల చేస్తే 24 గంటల తర్వాత చింతకుంటకు చేరుకుంటాయని ఈ మాత్రం జ్ఞానం లేని బిజెపి నాయకులు, కార్యకర్తలు ధర్నా చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిమజ్జన ఏర్పాట్లు బతుకమ్మ ఏర్పాట్లు అన్నీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంటే కళ్ళు లేని కబోదిలా రాజకీయం చేయడం సిగ్గుచేటు అన్నారు. అన్ని ఏర్పాట్లు ఇక్కడ కనిపిస్తుంటే నీళ్లు లేవని ఎలా అనుకున్నారని నీళ్లు లేకుండానే విగ్రహాలను నిమజ్జనం చేస్తారా ఈ మాత్రం సోయి లేదా అని ఎద్దేవా చేశారు.
ఇకనుండి ఈ డ్రామా రాజకీయాలు మానుకొని ప్రజల అవసరాలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సుడా చైర్మన్ తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




