Karimnagar: ఈవీఎం, వీవీప్యాట్ గోదామును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్!

Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదాములను అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సమగ్రంగా తనిఖీ చేశారు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 5 Nov 2026 5:25 PM IST
Karimnagar
X

Karimnagar: ఈవీఎం, వీవీప్యాట్ గోదామును తనిఖీ చేసిన అదనపు కలెక్టర్!

కరీంనగర్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో ఉన్న ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు), వీవీప్యాట్ గోదామును గురువారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. శ్రీనివాస్ రెడ్డి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాములో ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల భద్రతకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను ఆయన సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం ఈవీఎం, వీవీప్యాట్ గోదాములను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ, సంబంధిత వివరాలతో కూడిన నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి పంపిస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.

అనంతరం గోదాములోని ఈవీఎం, వీవీప్యాట్ భద్రపరిచిన గదులను పరిశీలించి, అక్కడ అమలు చేస్తున్న భద్రతా చర్యలు, పర్యవేక్షణ వ్యవస్థ, సిబ్బంది విధుల నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భద్రతా విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని పోలీస్ గార్డులకు సూచించారు.

అలాగే గోదాము పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, బీజేపీ పార్టీ ప్రతినిధి నాంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పడిశెట్టి భూమయ్య, టీడీపీ పార్టీ ప్రతినిధి ఎర్రబెల్లి రవీందర్, ఎంఐఎం పార్టీ ప్రతినిధి బర్కత్ అలీ, కరీంనగర్ తాసిల్దార్ ఎం రాజేష్ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN