Karimnagar: రోడ్ ఎక్కిన ఎలక్ట్రిక్ బస్సులు.. సాంకేతిక లోపాలు క్లియర్

Karimnagar: కరీంనగర్‌లో వారం రోజులుగా నిలిచిపోయిన ఎలక్ట్రిక్ బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 9 July 2026 8:32 AM IST
Karimnagar
X

Karimnagar: రోడ్ ఎక్కిన ఎలక్ట్రిక్ బస్సులు.. సాంకేతిక లోపాలు క్లియర్

కరీంనగర్: వరుస అగ్ని ప్రమాదాలతో నిలిచిపోయిన ఈ బస్సులు రోడ్డు ఎక్కడంతో ప్రయాణికుల బాధలు తీరాయి. గత వారం రోజులుగా కరీంనగర్ టు డిపోకు చెందిన ఈ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరీంనగర్ నుండి హైదరాబాద్, వరంగల్, గోదావరిఖని, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల,

వేములవాడ రూట్లలో ప్రయాణికులను చేరవేసే ఈ బస్సులు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఏం జరిగిందో అర్థం కాలేని పరిస్థితి. పలు రూట్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ బస్సులకు సంబంధించిన ఇంజనీర్లు టెక్నీషియన్లు కరీంనగర్ టు డిపోకు చేరుకొని బస్సులను క్షుణ్ణంగా పరిశీలించి లోపాలను సరిచేసి బస్సుల మెయింటెనెన్స్ సరైన పద్ధతిలో కొనసాగించాలని మెకానికులకు టెక్నీషియన్లకు సూచించారు.

ప్రయాణికుల భద్రతే ముఖ్యం అని డిపోకు చెందిన మేనేజర్లు, రీజనల్ మేనేజర్ తెలిపారు. ప్రయాణికులను ఆర్టీసీ సంస్థ క్షేమంగా భద్రంగా గమ్యస్థానానికి చేర్చడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే బస్సులను నిలిపి వాటి లోపాలను సరి చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమైన ప్రయాణమని అందుకే ప్రయాణికుల క్షేమమే మా భద్రత అని అధికారులు తెలిపారు.

కరీంనగర్ కు చెందిన ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డుపై తిరగడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story