Karimnagar: అభివృద్ధి పనులను పరిశీలించిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు
Karimnagar: కరీంనగర్‌లో డివిజన్‌లో కొనసాగుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ అభివృద్ధి పనులను డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Karimnagar: అభివృద్ధి పనులను పరిశీలించిన డిప్యూటీ మేయర్ సునీల్ రావు
కరీంనగర్: డివిజన్ లో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులను బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ యాదగిరి సునీల్ రావు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనుల పురోగతిని కాంట్రాక్టర్, అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా రాజీ పడకుండా, అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా తగు సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా త్వరలోనే మిగిలిన పనులన్నింటినీ పూర్తిచేసి అందమైన సిసి రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు స్థానిక కాలనీవాసులతో మాట్లాడారు. ఇంత త్వరగా అందమైన సీసీ రోడ్డును పూర్తి చేసి అందుబాటులోకి తెస్తున్నందుకు కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మించిన అధునాతన సిసి రోడ్లు, డ్రైనేజీలతో కాలనీ రూపురేఖలు మారి అందంగా, ప్రయాణానికి సౌకర్యవంతంగా ఏర్పడిందని తెలుపుతూ కృతజ్ఞతలు తెలియజేశారు.




