Karimnagar: గీతా భవన్ చౌరస్తాలో సీపీఎం, సీపీఐ నాయకుల ఆందోళన!

Karimnagar: కరీంనగర్ గీతా భవన్ చౌరస్తాలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన; ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్.

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar
Published on: 1 Oct 2026 2:31 PM IST
Karimnagar
X

Karimnagar: గీతా భవన్ చౌరస్తాలో సీపీఎం, సీపీఐ నాయకుల ఆందోళన!

Karimnagar: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, తొలగించిన ఓటర్లలో అర్హులైన వారిని వెంటనే చేర్చాలని, సర్ ప్రక్రియను నిలిపివేయాలని, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి డిమాండ్ చేశారు.

గురువారం రోజున రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సిపిఎం,సిపిఐ పార్టీల నాయకులు స్థానిక గీతా భవన్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి, కేదారిలు మాట్లాడుతూ ఓట్ల దొంగ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయకుంటే ఈ ఉద్యమం ఇక్కడితో ఆగబోదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపే ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు..

జ్ఞానేష్ కుమార్ సీఈసీగా కాకుండా బీజేపీకి, ప్రధాని మోడీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సర్ ప్రక్రియ వల్ల రాష్ట్రాల్లో ప్రభుత్వాలే మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే 37 లక్షల ఓట్లు తొలగించారన్నారు. దాంతో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు.

తమిళనాడులో డీఎంకే ఓడిపోయిందని అన్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగితే బీజేపీ ఓడిపోయే పరిస్థితి ఉందన్నారు. అందుకే బీజేపీ వ్యతిరేక ఓట్లను సుమారు 13 కోట్ల పైచిలుకు ఓట్లు ఈసి తొలగించిందని విమర్శించారు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ఈసి ద్వారా ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు.

జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, అయనపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయడం ప్రజల డిమాండ్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం ఈసిని నడపాలి కానీ ఆయన నిబంధనలను తుంగలో తొక్కారని అన్నారు. ఎన్నికలే ప్రజాస్వామ్యానికి మూలమని చెప్పారు. జ్ఞానేష్ కుమార్ ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశా

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar

CH Gopalakrishna, Regional Coordinator -Karimnagar

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న సీనియర్ పాత్రికేయులు మరియు ‘రీజినల్ కోఆర్డినేటర్’.