Karimnagar: కరీంనగర్ జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి సిపిఐ!

Karimnagar: కరీంనగర్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఐ డిమాండ్. అర్బన్ ప్రాంతాన్ని కరువు జాబితాలో చేర్చడంపై జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ విమర్శలు.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 28 Oct 2026 3:42 PM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి సిపిఐ!

Karimnagar: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతుందని ప్రభుత్వం తక్షణమే జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలనించి సిపిఐ డిమాండ్ చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా పూర్తిగా హాస్యాస్పదంగా, అశాస్త్రీయంగా ఉందని, జిల్లాలో కేవలం కరీంనగర్ రూరల్, కరీంనగర్ అర్బన్, మరియు హుజూరాబాద్ మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం దారుణమని, ఏ ప్రాతిపాదికన ఆ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అసలు వ్యవసాయ సాగు భూములే లేని,పూర్తిగా కాంక్రీట్ జంగిల్‌గా మారిన కరీంనగర్ అర్బన్ (సిటీ) పరిధిని కరువు ప్రాంతంగా చూపించడం,ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వర్షాల్లేక పంటలు నిలువునా ఎండిపోతున్న గ్రామీణ మండలాలను పక్కన పెట్టడం రైతాంగాన్ని ఘోరంగా వంచించడమేనని,ఆయా మండలాల్లో ఎండుతున్న పంటలు అధికారులకు కనబడడం లేదా అని శ్రీనివాస్ ప్రశ్నించారు.

జిల్లాలోని మానకొండూరు,తిమ్మాపూర్, గంగాధర,రామడుగు,చొప్పదండి,చిగురుమామిడి,సైదాపూర్,శంకరపట్నం, ఇల్లందకుంట వంటి మండలాల్లో వరి,పత్తి పంటలకు సాగునీరు అందక,ప్రభుత్వం విద్యుత్ సకాలంలో ఇవ్వక చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని,ఇవన్నీ అధికారులకు కనిపించడం లేదా? అధికారుల తప్పుడు నివేదికల వల్ల జిల్లాలోని మెజారిటీ రైతులు ప్రభుత్వ పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ),పంట రుణాల మాఫీ/రీషెడ్యూల్,ఇన్సూరెన్స్ వంటి లబ్ధిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కేవలం కరీంనగర్ రూరల్, అర్బన్, హుజూరాబాద్‌ మండలాలకు మాత్రమే పరిమితం చేసిన అశాస్త్రీయ జీవోను, కరువు జాబితాను సవరించాలని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతుంటే క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వెళ్లకుండా,ఏసీ రూముల్లో కూర్చుని ఉపగ్రహ చిత్రాలు,తప్పుడు తేమ లెక్కల ఆధారంగా నివేదికలు తయారు చేశారని దీనిని బట్టే అధికారుల పనితీరు ఎలా ఉందో స్పష్టమవుతోందన్నారు.

జిల్లా వ్యాప్తంగా రీ-సర్వే చేసి తక్షణమే ప్రత్యేక అధికారుల బృందాలతో క్షేత్రస్థాయిలో పంట నష్టంపై పారదర్శకంగా నివేదిక తయారు చెయ్యాలని, పంటలు ఎండిపోయిన ప్రతీ మండలాన్ని కరువు జాబితాలో చేర్చుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఎల్‌నినో వర్షాభావంతో దెబ్బతిన్న ప్రతి ఎకరాకు 25 వేల రూపాయల తక్షణ పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) అందించి రైతులను ఆదుకోవాలని,జిల్లా వ్యాప్తంగా కరువు పీడిత రైతులందరి పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలనీ, బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు రైతుల నుండి బలవంతపు వసూళ్లకు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN