Karimnagar: కమీషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులపై సీపీ గౌష్ ఆలం సమీక్ష!
Karimnagar: కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని, రెండేళ్లు దాటిన కేసుల్లో నిందితులను అరెస్ట్ చేయాలని సీపీ గౌష్ ఆలం ఆదేశించారు.
Karimnagar: కమీషనరేట్ పరిధిలో పెండింగ్ కేసులపై సీపీ గౌష్ ఆలం సమీక్ష!
Karimnagar: రెండేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసుల్లో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. నిర్దేశిత గడువులోగా (60 / 90 రోజుల్లో) చార్జ్ షీట్లు దాఖలు చేయాలని ఆదేశం. రౌడీ షీటర్లు, సంఘ విద్రోహ శక్తులపై నిరంతర నిఘా ఉంచాలి. సైబర్ నేరాల మ్యూల్ ఖాతాలపై కఠిన చర్యలు 29 బ్యాంక్ బ్రాంచ్‌లపై దృష్టి దుర్గామాత ఉత్సవాల సందర్భంగా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలి
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమీషనరేట్ అధికారులతో సమగ్ర నేర సమీక్ష కమీషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలని పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం, సంబంధిత అధికారులను ఆదేశించారు. కమీషనరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని డివిజన్ల ఏసీపీలు, సీఐలు, ఎస్సైలతో సమగ్ర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, కేసుల పరిష్కార (డిస్పోజల్) వివరాలను క్షుణ్ణంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ జారీ చేసిన కీలక మార్గదర్శకాలు:
నిందితుల తక్షణ అరెస్ట్: రెండేళ్లకు పైబడి పెండింగ్‌లో ఉండి, నిందితులు పట్టుబడని కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి. పాత కేసుల్లో తప్పించుకు తిరుగుతున్న నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచాలి.
సకాలంలో చార్జ్ షీట్లు: కేసు స్వభావాన్ని బట్టి నిర్దేశిత చట్టబద్ధమైన గడువు (60 లేదా 90 రోజుల్లోగా) లో సమగ్ర దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్ షీట్లు దాఖలు చేయాలి. దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు. రౌడీ షీటర్లపై కఠిన నిఘా: కమీషనరేట్ పరిధిలోని రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన ప్రివెంటివ్ డిటెన్షన్ చర్యలు చేపట్టాలి.
స్టేషన్ల వారీగా డిస్పోజల్ లక్ష్యాలు: పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ కార్యాచరణ రూపొందించుకోవాలి. బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు వేగవంతం చేయాలి.
మ్యూల్ ఖాతాలపై చర్యలు: సైబర్ మోసాలకు వినియోగిస్తున్న మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. ఇప్పటికే గుర్తించిన 29 బ్యాంక్ బ్రాంచుల ఆధారాల మేరకు బాధ్యులపై కేసులు నమోదు చేయాలి.
దుర్గామాత ఉత్సవాల భద్రత: రానున్న దుర్గామాత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను పర్యవేక్షించాలి. ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ పకడ్బందీ బందోబస్తు నిర్వహించాలి.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కమీషనరేట్ అదనపు డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, మాధవి, తదితర సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.




