Karimnagar: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్, జిరాక్స్ బంద్!
Karimnagar: కరీంనగర్, హుజూరాబాద్‌లలో TGPSC పరీక్ష కేంద్రాలను సీపీ గౌష్ ఆలం తనిఖీ చేశారు. కట్టుదిట్టమైన భద్రత, బయోమెట్రిక్ ప్రక్రియను పరిశీలించారు.
Karimnagar: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్, జిరాక్స్ బంద్!
Karimnagar: కరీంనగర్ నగరంలోని వివేకానంద డిగ్రీ కళాశాల, హుజూరాబాద్‌లోని కిట్స్ (KITS) ఇంజనీరింగ్ కళాశాలల్లో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న అసిస్టెంట్ సైంటిస్ట్, అనలిస్ట్ గ్రేడ్-II ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రత కల్పించామని, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.
పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించినట్లు వెల్లడించారు. సీసీ కెమెరాల నిఘా, బయోమెట్రిక్ విధానం, అభ్యర్థుల గుర్తింపు ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈ తనిఖీల్లో పోలీస్ అధికారులు, కేంద్రాల సమన్వయకర్తలు పాల్గొన్నారు.




