Karimnagar: స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సిపి గౌష్ ఆలం

Karimnagar: కరీంనగర్ స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సీపీ గౌష్ ఆలం. పాస్‌పోర్ట్, పోలీస్ వెరిఫికేషన్లు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 10 Nov 2026 7:15 PM IST
Karimnagar
X

Karimnagar: స్పెషల్ బ్రాంచ్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సిపి గౌష్ ఆలం

కరీంనగర్: ​స్పెషల్ బ్రాంచ్ (SB) కార్యాలయాన్ని మంగళవారం పోలీస్ కమిషనర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి, వివిధ విభాగాలను పర్యవేక్షించే అధికారులు మరియు సిబ్బందితో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ఈ సమీక్షలో భాగంగా ప్రధానంగా పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, ఉద్యోగ (జాబ్) ధ్రువీకరణ, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ల (PVC) జారీ ప్రక్రియపై ఆరా తీశారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, నిర్దేశిత గడువులోగా నిక్కచ్చిగా వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి ధ్రువపత్రాలు జారీ చేయాలని స్పష్టం చేశారు.

అలాగే సోషల్ మీడియా విభాగం పనితీరు, ఫీల్డ్ అధికారుల కార్యాచరణపై సమీక్షించి, క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ సమాచార సేకరణను వేగవంతం చేయాలని ఫీల్డ్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

​కార్యాలయ సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులపై సత్వరమే స్పందించాలని పలు కీలక సూచనలు జారీ చేశారు.

​ఈ తనిఖీ మరియు సమీక్షా సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్ అనిల్, డి.ఎ.వొ. విరాజ్ తో పాటు ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR