Jammikunta: నాయిని చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన!
Jammikunta: జమ్మికుంట నాయిని చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీపీ గౌస్ అలాం. భక్తులకు ఇబ్బంది లేకుండా 3 క్రేన్లు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశం.
Jammikunta: నాయిని చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన!
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో జరగనున్న శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం నాయిని చెరువు వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ గౌస్ అలాం పరిశీలించారు.
ఈ సందర్భంగా నిమజ్జన కార్యక్రమాన్ని సురక్షితంగా, వేగవంతంగా నిర్వహించేందుకు మూడు క్రేన్లతో నిమజ్జన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. పరిశీలనలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్), మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, ఏసీపీ శ్రీమతి మాధవి, సీఐ రామకృష్ణ గౌడ్, ఎస్‌ఐలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా నాయిని చెరువు వద్ద గణేష్ నిమజ్జనానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లు, పారిశుద్ధ్య చర్యలు, విద్యుత్ సౌకర్యాలు, తాగునీటి వసతి, లైటింగ్ ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చనున్నట్లు తెలిపారు.పట్టణ ప్రజలు గణేష్ మండపాలను సురక్షితంగా ఏర్పాటు చేసుకోవాలని, ప్రభుత్వం పోలీసు శాఖ జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని, భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు.




