Karimnagar: గులాం అహ్మద్ హుస్సేన్ సేవలు అభినందనీయం: సీపీ గౌస్ ఆలం
Karimnagar: కరీంనగర్ సీరత్ ఎక్స్‌పోలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్ ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ స్టాల్‌ను సీపీ గౌస్ ఆలం సందర్శించారు.
Karimnagar: గులాం అహ్మద్ హుస్సేన్ సేవలు అభినందనీయం: సీపీ గౌస్ ఆలం
కరీంనగర్: మొన్న వినాయక నిమజ్జనంలో హిందూ సోదరులకు నేడు జమాతీ ఇస్లామీ హింద్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న ముస్లిం సోదరులందరికీ, తన సొంత ఖర్చులతో ఎంఐఎం పార్టీ ద్వారా మినరల్ వాటర్ అందిస్తున్న ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులామ్ అహ్మద్ హుస్సేన్. గులామ్ అహ్మద్ హుస్సేన్ సేవలు అభినందనీయమని, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మౌలానా వలిఉల్లా సయ్యద్ ఫలాహి, జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడు సోహైబ్ అహ్మద్ ఖాన్ అన్నారు.
ఆదివారం నగరంలోని మహాత్మ జ్యోతిబాపూలే స్మారక పార్క్, సర్కస్ గ్రౌండ్లో జమాతే ఇస్లామీ హింద్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎక్స్ పో2026లో, ఎంఐఎం అధ్యక్షుడు హైదరాబాద్ ఎంపీ బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ స్టాల్ ను, కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం కుటుంబ సభ్యుల సమేతంగా వచ్చి సందర్శించారు.
పోలీస్ కమిషనర్ కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా స్టాల్ లోకి ఆహ్వానించి, గులామ్ అహ్మద్ హుస్సేన్ శీతలపాలయాలను వారికి అందించారు. సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మౌలాన వలీవుల్లా సయ్యద్ ఫలాహి మాట్లాడుతూ.. గులాం అహ్మద్ హుస్సేన్ లాంటి సెక్యులర్ భావాలు కలిగిన నాయకుడు, హిందూ ముస్లిం అనే తేడా లేకుండా సేవలు అందించడం అభినందనీయమన్నారు.
ఈ స్టాల్ ను ఏర్పాటు చేసిన గులాం అహ్మద్ హుస్సేన్ కు, జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడు సోహైబ్ అహ్మద్ ఖాన్, మంకమ్మ తోట డివిజన్ అధ్యక్షుడు ఖైరోద్దీన్ లు కృతజ్ఞతలు తెలిపారు. సిరప్ ఎక్స్పో 2026 లో తనకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు జమాతే ఇస్లామి హింద్ జిల్లా శాఖకు గులాం అహ్మద్ హుస్సేన్ ప్రతిగా కృతజ్ఞతలు తెలిపారు.
గులాం అహ్మద్ హుస్సేన్ తో పాటు ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు, రెండు టీంలుగా ఏర్పడి ఎక్స్పోలో ఉన్నటువంటి ప్రతి స్టాల్ ను సందర్శించి, స్టాల్ నిర్వాహకులకు, ఎక్స్ పోకు వచ్చే వేలాది సందర్శకులకు బిస్లరీ వాటర్ బాటిల్ లను స్వయంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సయ్యద్ ఇబ్రహీం, కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్లు అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ, ఆరిఫ్ అహ్మద్, లింగపల్లి శ్రీనివాస్, అబ్దుల్లా ఖాన్, కంటెస్టెడ్ కార్పొరేటర్లు అబ్దుల్ గఫ్ఫార్, సురేశ్, వాజిద్ ఖాన్, ఖాజా మజారోద్దీన్, గాలి రాజు, నాయకులు కింగ్ సాజిద్, మెరాజోద్దీన్, సుల్తాన్ మిర్జా, ఫసియుద్దీన్ ఖాలీద్, ఖమరొద్దీన్ షబ్బీర్, సలీం, జమాతే ఇస్లామీ హింద్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.




