Karimnagar: కరీంనగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్
Karimnagar: కరీంనగర్ 50వ డివిజన్ జ్యోతి నగర్‌లో సీసీ రోడ్ల పనులను పరిశీలించిన కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశం.
Karimnagar: కరీంనగర్‌లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్
కరీంనగర్: కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 50వ డివిజన్ జ్యోతి నగర్ ప్రాంతంలో ముమ్మరంగా సాగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన నిర్మాణ పనుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించి, అధికారులతో కాంట్రాక్టర్లతో మాట్లాడారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా, నిబంధనల ప్రకారం పనులు జరిగేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
స్థానికులకు ఎలాంటి రాకపోకల ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




