Karimnagar: బీఆర్ఎస్ ధర్నా డ్రామా: వైద్యుల అంజన్ కుమార్!

Karimnagar: కరీంనగర్‌లో బీఆర్ఎస్ ధర్నా కేవలం డ్రామా అని కాంగ్రెస్ నేత వైద్యుల అంజన్ కుమార్ మండిపాటు; మేయర్ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు మద్దతిచ్చారని నిలదీత.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 9 Oct 2026 7:58 PM IST
Karimnagar
X

Karimnagar: బీఆర్ఎస్ ధర్నా డ్రామా: వైద్యుల అంజన్ కుమార్!

Karimnagar: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈరోజు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ధర్నా కేవలం డ్రామా అని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్ మండిపడ్డారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేయర్ ఎన్నిక సమయంలో మీకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు? మేయర్ ఎన్నికల్లో బీజేపీ నాయకుడికి మద్దతు ఇచ్చి ఎలా గెలిపించారు? బీజేపీ అంటేనే పండుగలు, అభివృద్ధి కాదు, కేవలం హిందుత్వం పేరుతో ఓట్లు దండుకోవడమే. అలాంటి బీజేపీకి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఏ విధంగా మద్దతు ఇచ్చిందని ప్రశ్నించారు. ఎన్ని కోట్ల రూపాయల కోసం మద్దతు ఇచ్చారు కరీంనగర్ ప్రజలు గమనిస్తున్నారు" అని అన్నారు.

టీఆర్ఎస్ - బీజేపీ ల చీకటి ఒప్పందాలను ప్రజలు గమనించాలి...

ప్రజల దృష్టిని మరల్చడం కోసమే ఈ ధర్నా డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తా. అభివృద్ధి జరగడంలేదని అంటున్న నాయకులు దానిపై ఎందుకు మాట్లాడడం లేదని మీ మాజీ నాయకుడే అందులోకు పోయి ఆయన చీకటి దందాలు బయటకు తెలుస్తాయని మారు మాట్లాడకుండా ఉంటున్నారని అన్నారు. ముందున్న పండగ సందర్భంగా కరీంనగర్ లో రాబోయే బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లైట్లు, శానిటేషన్ తదితర ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ కోరారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN