Karimnagar: భవనాల నిర్మాణాలను తనిఖీ చేసిన కమీషనర్ ప్రఫుల్

Karimnagar: కరీంనగర్‌లో అక్యూపెన్సీ సర్టిఫికెట్ల జారీ కోసం సెట్ బ్యాక్, ఇంకుడు గుంతలు, అనుమతులను కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.

G. SUDHAKAR, KARIMNAGAR
Updated on: 19 Nov 2026 9:48 PM IST
Karimnagar
X

Karimnagar: భవనాల నిర్మాణాలను తనిఖీ చేసిన కమీషనర్ ప్రఫుల్

కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా నిర్మించిన భవనాలకు అక్యూపెన్సీ సర్టిఫికెట్ (OC) జారీ చేసే ప్రక్రియలో భాగంగా, నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ నగరంలో విస్తృతంగా పర్యటించారు. టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో కలిసి నగరంలోని అల్కపురి, సదాశివపల్లి, కట్టరాంపూర్, మంకమ్మతోట తదితర ప్రాంతాల్లో నిర్మాణం పూర్తయిన పలు భవనాలను కమీషనర్ సందర్శించి ఆకస్మిక తనిఖీ చేశారు.

నగరంలో అక్యూపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న భవన యజమానులు మున్సిపల్ అనుమతులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారా లేదా అన్న కోణంలో భవనాలను స్వయంగా పరిశీలించారు. తనిఖీలలో భాగంగా భవనాల చుట్టూ వదలవలసిన 'సెట్ బ్యాక్' స్థలాలు, వర్షపు నీటి సంరక్షణ కోసం తప్పనిసరిగా నిర్మించాల్సిన ఇంకుడు గుంతల ఏర్పాటును కమీషనర్ స్వయంగా పరిశీలించారు.

అనుమతించిన ప్లాన్‌కు విరుద్ధంగా ఎలాంటి అదనపు నిర్మాణాలు ఉన్నా, నిబంధనలు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలన్నీ పక్కాగా పాటించిన భవనాలకు మాత్రమే నిబంధనల ప్రకారం అక్యూపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. ఈ తనిఖీల్లో నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తేజశ్వినీ, అశ్వినీ సిబ్బంది పాల్గొన్నారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR