Karimnagar: ఓటు చోరీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలి: ఎమ్మెల్యేలు!

Karimnagar: కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ భారీ నిరసన ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మల దహనం ఓటు చోరీపై సుప్రీంకోర్టు విచారణకు ఎమ్మెల్యేల డిమాండ్.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 28 Sept 2026 5:20 PM IST
Karimnagar
X

Karimnagar: ఓటు చోరీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలి: ఎమ్మెల్యేలు!

కరీంనగర్: కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. ఓటర్ల జాబితా సవరణ, ఓటు చోరీ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఈ నిరసనలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేసి సీఈసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఓటర్ల జాబితాలో ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల చేర్పుల్లో అవకతవకలు జరుగుతున్నాయని విమర్శించారు.

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించిన ఓటు చోరీ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ గెలిచిన ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్న తమ ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడుకునేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాడాలని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN