Karimnagar: కొత్తగట్టు వద్ద జాతీయ రహదారి ర్యాంపు నిర్మించాలని కలెక్టర్ ఆదేశం!

Karimnagar: కరీంనగర్ జిల్లా కొత్తగట్టు వద్ద జాతీయ రహదారి నిర్మాణ సమస్యపై కలెక్టర్ చిత్రా మిశ్రా స్పందించారు. క్రాసింగ్ వద్ద ర్యాంపు నిర్మించాలని ఆదేశం.

SUDHAKAR, KARIMNGAR TOWN
Published on: 7 Oct 2026 8:37 AM IST
Karimnagar
X

Karimnagar: కొత్తగట్టు వద్ద జాతీయ రహదారి ర్యాంపు నిర్మించాలని కలెక్టర్ ఆదేశం!

Karimnagar: కొత్తగట్టు స్టేజి వద్ద జాతీయ రహదారి నిర్మాణంతో గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు. గ్రామస్తులు రహదారిని సురక్షితంగా దాటేందుకు వీలుగా క్రాసింగ్‌ వద్ద ర్యాంపు నిర్మాణం చేపట్టాలని సూచించారు.

కొత్తగట్టు వద్ద జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా తమ గ్రామానికి వెళ్లేందుకు సరైన ర్యాంపు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు విన్నవించారు. అండర్‌పాస్‌ల నుంచి గ్రామస్తులు సాఫీగా రాకపోకలు సాగించేలా ఒక వైపు ఇప్పటికే నిర్మించిన ర్యాంపుతో పాటు మరో వైపు కూడా ర్యాంపు నిర్మించాలని కోరారు.

గ్రామస్తుల విజ్ఞప్తిపై స్పందించిన కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, జాతీయ రహదారి-563 ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్ తదితర అధికారులతో కొత్తగట్టు వద్ద నెలకొన్న పరిస్థితిపై చర్చించారు. కొత్తగట్టు వద్ద ర్యాంపు లేకపోవడంతో గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారు చేసిన విజ్ఞప్తి, సమస్యకు పరిష్కార మార్గాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్రాసింగ్‌ వద్ద ర్యాంపు నిర్మాణానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు.

SUDHAKAR, KARIMNGAR TOWN

SUDHAKAR, KARIMNGAR TOWN